Saturday, 18 May 2024 01:00:11 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పుష్పగిరి క్షేత్రంలో కొనసాగుతున్న వజ్రాల వేట.. బతుకు మారుతుందనే ఆశతో జల్లెడపడుతున్న ప్రజలు..

Date : 17 October 2023 11:31 AM Views : 70

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : కడప జిల్లా పుష్పగిరి కొండను జల్లెడ పడుతున్నారు ప్రజలు. వజ్రాల వేటను జోరుగా సాగిస్తున్నారు. కొత్తగా కనిపించిన ప్రతిరాయిని బుట్టలో వేసుకుంటున్నారు. పంచ నదిక్షేత్రమైన ఇక్కడ చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వర ఆలయం ఉన్నాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకేనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కడప జిల్లాలో వజ్రాల వేట జోరుగా సాగుతుంది. వల్లూరు మండలం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి క్షేత్రం కొండమీద వేల సంఖ్యలో ప్రజలు వజ్రాల వేట సాగిస్తున్నారు. కడప నుంచి 16 కి .మి.దూరంలో ఉన్న ఈ కొండకు ఉదయాన్నే చేరుకొని వజ్రాల కోసం వేతుకులాట సాగిస్తున్నారు. పుష్పగిరి కొండపై వజ్రాలు దొరికాయన్న ప్రచారంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకొని వజ్రాల వేట కొన్ని రోజులుగా కొనసాగిస్తున్నారు. కొండ కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నానది ప్రవహిస్తుంది. నది కూడా పాము ఆకారంలో ఉంటుంది. అలాగే పుష్పగిరికి సమీపంలో పాపాఘ్ని, కుమ్ముద్వతి, వల్కల, మాండవి నదులు కలుస్తున్నాయి. పంచ నది క్షేత్రమైన ఇక్కడ చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వర ఆలయం ఉన్నాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకేనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇంత గొప్ప చరిత్ర కల్గిన పుష్పగిరి కొండలో వజ్రాలు దొరుకుతున్నాయని టాక్ చక్కర్లు కొట్టడంతో కడప, కర్నూలు, అన్నమయ్య జిల్లాల నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వజ్రాల కోసం పుష్పగిరి కొండ చుట్టూ ప్రజలు జల్లెడ పడుతున్నారు. కొంచెం కొత్తగా ఏదైనా రాయి కనబడితే చాలు వాటిని సంచుల్లో వేసుకొని వజ్రాల కోసం గాలిస్తున్నారు. వజ్రాలు దొరికితే తమ బ్రతుకులు మారుతాయని ఆశతో వచ్చామని కొందరు చెబుతున్నారు. వజ్రాల వేట జోరుగా సాగుతున్నా అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :