Saturday, 18 May 2024 01:59:52 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కులగణనకు ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన జగన్‌ సర్కార్‌

Date : 18 November 2023 08:15 AM Views : 65

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : కుల గణన ప్రక్రియలో భాగంగా బీసీ సంక్షేమ శాఖ నేతృత్వంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. కుల సంఘాలు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, మేధావులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి.. సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. రెండు రోజుల పాటు జిల్లా స్థాయి సమావేశాలు కొనసాగగా.. నేటి నుంచి రీజినల్‌ మీటింగ్స్‌ షురూ అయ్యాయి. రాజమండ్రి వేదికగా తొలి రీజినల్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సదస్సులో కలెక్టర్ మాధవీలత, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌, ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘం నేతలు పాల్గొన్నారు. కుల గణన ప్రక్రియను ముట్టకోవడానికే భయపడే పరిస్థితుల్లో.. సీఎం జగన్‌ దాన్ని చాలెంజ్‌గా తీసుకున్నారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌. ఏపీలో మొత్తం 723 కులాలపై సమగ్ర గణన చేయాల్సి ఉందని చెప్పారు. ఎప్పుడో బ్రిటీష్‌ కాలంలో జరిగిన కులగణనను మళ్లీ సీఎం జగన్‌ హయాంలో చేపట్టడం హర్షణీయమన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌. జనగణన జరిగినప్పుడు కులగణన ఎందుకు జరగకూడదనే డిమాండ్ ఎప్పటినుంచో ఉందన్నారు ఎంపీ భరత్. మొత్తంగా.. ఏపీ ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిన కులగణన ప్రక్రియపై వివిధ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం అమలు జరగడానికి కుల గణన దోహదపడుతుందంటున్నారు మేధావులు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :