Saturday, 15 February 2025 07:16:18 PM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

విజయవాడలో మహిళపై గ్యాంగ్ రేప్

Date : 20 December 2022 11:52 AM Views : 309

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది. నలుగురు వ్యక్తులు కలిసి మహిళకు బలవంతంగా మద్యం తాగించి.. గదిలో బంధించి మూడు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకోగా.. సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితురాలు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ రేప్ కేసు ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలి పనులు చేసుకుని బతికే ఓ మహిళను కొందరు టార్గెట్ చేశారు. అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్ లో పని చేసే వ్యక్తి ఈ నెల 17న నమ్మించి కానూరు సనత్ నగర్లోని ఓ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ అతడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు జతకలిశారు. ఆమెకు మద్యం తాపించి.. మూడు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పెనమలూరు పోలీసులు బాధితురాలితో మాట్లాడారు. సోమవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి.. నిందితుల కోసం గాలించారు. సులభ్‌ కాంప్లెక్స్‌లో పనిచేసే ఓ వ్యక్తితో పాటు మరో ముగ్గురు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు పోలీసులు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :