జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబ సమేతంగా మంగళవారం పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించనున్నారు. కుమారుడి వివాహ ఆహ్వానపత్రిక ఘాట్ దగ్గర ఉంచి.. షర్మిల కుటుంబసభ్యులు ఆశీస్సులు తీసుకోనున్నారు కాగా తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూఇయర్ విషెస్‌తో పాటు మరో తీపి కబురును కూడా ప్రజలతో పంచుకున్నారు. అదే షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి విషయం. ఈ సంవత్సరంలో తన కుమారుడి వివాహం జరుగనున్నట్లు తెలిపారు. వైఎస్ రాజారెడ్డికి, అట్టూరి ప్రియతో వివాహం నిశ్చయం అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుక తేదీ, పెళ్లి డేట్‌ను షర్మిల ప్రకటించారు.
Admin