Saturday, 18 May 2024 01:59:49 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నగరంలో వేడుకగా సదర్ సంబరాలు.. ఘనంగా దున్నరాజుల ఊరేగింపు

Date : 14 November 2023 12:55 PM Views : 68

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఒకప్పుడు భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ఈ మాటను హైదరాబాద్‌కి అన్వయం చేయాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో విభిన్న జాతుల వారు నివసిస్తున్నారు. వీరు తమ సాంప్రదాయ పండుగలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిని చూసేందుకు హైదరాబాదీలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మన్నటి వరకూ గణేశ్ నవరాత్రుల శోభతోపాటూ దేవీ నవరాత్రులు కూడా ముగిశాయి. ఇక దీపావళి సందర్భంగా సదర్ ఉత్సవాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగర వీధుల గుండా దున్న పోతులను ఊరేగించారు. ఈ కార్యక్రమం ప్రతి ఏటా దీపావళి మరుసటి రోజున నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏర్పాటు చేస్తారు. నిన్న ఖైరతాబాద్ పెద్ద గణేశ్‌ను ఏర్పాటు చేసే ప్రాంతంలో గుజరాత్, హర్యానా నుంచి తెప్పించిన దున్నరాజాలకు ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ విచ్చేశారు. ముందుగా దున్నరాజులకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ దున్నరాజాల నిర్వహణకు ప్రత్యేకమైన శ్రద్ద వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఏటా లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటికి ఆహారంగా డ్రైఫ్రూట్స్, పండ్లు ఆహారంగా పెడడతామన్నారు. వీటికి ప్రత్యేకంగా ఆయిల్ మసాజ్ చేస్తామని చెప్పారు. వీటిని అప్పుడప్పుడూ పోటీలకు కూడా పంపిస్తామని చెప్పారు. ఇవి దేశంలోనే అత్యంత భారీ కాయం కలిగిన దున్నరాజాలుగా పేర్కొన్నారు. ఒక్కొక్క దున్నపోతు ఎత్తు 6.5అడుగులు, 2000 కేజీలు ఉంటాయి. ఇప్పటి వరకూ 15పైగా ఛాంపియన్ మెడల్స్ గెలుచుకున్నట్లు వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే పశుమేళాల్లో కూడా ఇవి పాల్గొంటాయని చెప్పారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :