Saturday, 18 May 2024 01:00:03 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేనుచిరంజీవికి డై హార్డ్‌ ఫ్యాన్‌.. మెగాస్టార్‌ తర్వాత ఆ హీరోనే నా ఫేవరెట్‌ఎమ్మెల్సీ కవిత

Date : 29 October 2023 09:29 AM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉంటారు. దీనికి తోడు త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో వరుసగా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారామె. పాలిటిక్స్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్సీ కవిత తాజాగా నెటిజన్లతో ముచ్చటించారు. #AskKavitha అంటూ ఫాలోవర్లు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. ఈ సందర్బంగా రాజకీయాలు, సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. ఇందులో భాగంగా ఒక నెటిజన్‌.. ‘చిరంజీవి అభిమానిగా ఆయన గురించి ఏమైనా చెప్పండి’ అని ఒక నెటిజన్ కవితను అడిగారు. దీనికి ఆమె ‘డై హార్డ్ ఫ్యాన్’ అని ఆన్సర్‌ ఇచ్చారు. అలాగే మరో నెటిజన్ కూడా మీ ఫేవరేట్ హీరో ఎవరు మేడమ్ అని అడగ్గా.. ‘మెగాస్టార్‌ చిరంజీవి ఆల్వేస్‌.. నెక్ట్స్ అల్లు అర్జున్.. తగ్గేదేలే’ అంటూ జిఫ్‌ ఇమేజ్‌ను షేర్‌ చేశారు కవిత. ప్రస్తుతం కవిత చెప్పిన సమాధానాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీటిని చూసి చిరంజీవి, అల్లు అర్జున్‌ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎమ్మెల్సీ కవిత మెగా ఫ్యామిలీపై అభిమానం చాటుకోవడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో పలు ఇంటర్వ్యూల్లోనూ ‘మీకు బాగా ఇష్టమైన నటుడు’ అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ‘చిరంజీవి ఆల్వేస్‌’ అని సమాధానమిచ్చారు. అలాగే ఖైదీ 150 సినిమాకు ముందు ‘ చిరంజీవి150 సినిమా కోసం వేచి చూస్తున్నాను. ఒకసారి అభిమాని అయ్యాక ఎప్పటికీ అభిమానిగానే ఉంటాం’ అని కవిత చెప్పుకొచ్చారు. ఇప్పుడీ వీడియోను కూడా కామెంట్ల రూపంలో పోస్ట్‌ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్‌.. అల్లు అర్జున్.. తగ్గేదేలే.. నాన్న తర్వాత ఆ రాజకీయ వేత్తనే ఇష్టం.. ఇక రాజకీయాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు నెటిజన్లు.. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుందని మీరు భావిస్తున్నారు’ అని అడగ్గా.. తెలంగాణ ప్రజల దీవెనలతో 100 సీట్లు గెలుస్తామన్నారు కవిత. అలాగే మీ తండ్రి కేసీఆర్‌ కాకుండా మీకు ఇష్టమైన రాజకీయవేత్త ఎవరు?’ అని మరొకరు అడగ్గా మమతా దీదీ అని కవిత సమాధానం ఇచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :