Saturday, 18 May 2024 10:36:19 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సోషల్ మీడియాతో అతి చేస్తే… కటకటాల్లోకే — ఏపీ సీఐడీ

Date : 16 November 2023 11:56 PM Views : 87

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన, రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్న వారికి చుక్కలు చూపిస్తుంది సీఐడీ. ఇకపై ఈ వింగ్ మరింత ఫోకస్ పెంచనుంది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై 24 గంటలు మానిటరింగ్ ఉండేలా ఒక మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఏ ID నుంచి పోస్ట్ పెడుతున్నారు, ఎలాంటి పోస్టులు పెడుతున్నారు..? అనే అంశాలను గమనిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులను తొలగిస్తూ.. వాటిని పోస్ట్ చేసినవారిపై కట్టినమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ మానటరింగ్ సెల్‌లో సోషల్ మీడియాతో పాటు ఆన్లైన్, సైబర్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలపై నైపుణ్యం ఉన్న కానిస్టేబుల్స్ ఉంటారు. వీరితో పాటు మరో 25 మంది నిపుణులైన అధికారులను కుడా నియమించనున్నారు. ఈ టీమ్‌లో మొత్తం 100 మందికి పైగా ప్రత్యేక శిక్షణ పొందినవారు ఉంటారు. విదేశాల నుండి పోస్టులు పెట్టిన వారిని కూడా శిక్ష వేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందకు వెళ్లనున్నారు. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాపై సీఐడీ మరింత ఫోకస్ పెట్టింది. రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, వ్యక్తులను కించపరిచేలా ఎవ్వరూ పోస్టులు పెట్టినా తోలు తీయనున్నారు. సొంత ఐడీ అయినా, ఫేక్ ఐడీ అయినా కూడా ఈజీగా పట్టేస్తారు. తద్వారా సోషల్ మీడియా ద్వారా జరిగే వేధింపులకు చెక్ పెట్టనున్నారు. ఈ ప్రత్యేక విభాగం నిత్యం అన్ని రకాల పోస్టులను మానిటర్ చేస్తుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై ఉక్కుపాదం మోపుతుంది. పదే, పదే తొలగిస్తూ పదే పదే అలా చేస్తున్నా వారిపై షీట్స్ కూడా ఓపెన్ చేయనున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :