Saturday, 18 May 2024 10:36:16 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

వృద్దురాలి ఇంటిలో దోపిడీకి పాల్పడిన యువతితో పాటు చోరీ సొత్తును కోనుగోలు చేసిన ఇద్దరు అరెస్ట్

Date : 13 December 2022 07:52 PM Views : 190

జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : వరంగల్ ( జై భీమ్ క్రైమ్ ప్రతినిది ): లేబర్ కాలనీలో ఒంటరిగా నివాసం వుంటున్న వృద్ధ మహిళ కండ్లల్లో కారం చల్లి, చేతులు కట్టిపడేసి దోపిడీకి పాల్పడిన యువతితో పాటు చోరీ సొత్తును కోనుగోలు చేసిన మరో ఇద్దరు నిందితులను సిసిఎస్. మరియు మీల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కల్పిమంగళవారం అరెస్ట్ చేసారు. దోపిడీకి పాల్పడిన యువతి నుండి పోలీసులు ఒకలక్ష నలభైఆరువేల రూపాయల నగదు, ఒక ద్విచక్రవాహనం, నిందితురాలు నేరానికి ఉ పయోగించిన బురఖా, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకోగా, చోరీ సొత్తును కోనుగోలు చేసిన ఇద్దరు. నిందితుల నుండి పోలీసులు రెండు లక్షల పదిహేను వేల రూపాయల విలువగల 60 గ్రాముల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి అదనపు డిసిపి క్రైమ్స్ పుష్పారెడ్డి వివరాలను వెల్లడిస్తూ వరంగల్ జిల్లా లేబరాకాలనీలో తల్లిదండ్రులతో కల్సి నివాసం వుంటున్న నిందితురాలు నాగిరెడ్డి మేఘన, స్థానిక డిగ్రీ కళాశాలో బిబియం రెండవ సంవత్సరం చదువుతూ, హనుమకొండలో బ్యూటీ పార్లర్ లో పార్ట్ టైం ఉద్యోగి గా పనిచేస్తోంది. నిందితురాలి తండ్రి మద్యానికి వ్యసపరుడు కావడంతో ఇంటి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు తన కుటుంబ, వ్యక్తిగత అవసరాలకు డబ్బు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకుంది. సదరు నిందితురాలు బాధిత వృద్ధురాలికి చెందిన మూడు అంతస్తుల భవనంలో కొద్దికాలం కిరాయికి వుంది వెళ్ళింది. ఒంటరిగా నివాసం వుంటున్న వృద్ధురాలి ఒంటిపై వున్న బంగారాన్ని చోరీ చేసుకోనేందుకుగా నిందితురాలు ప్రణాళిక వేసుకుంది. ఇందుకోసం గతంలో తనను గుర్తుపట్టకుండా బురఖా ధరించి స్నేహితురాలి సాయం చేసిన తీరులో మరో మారు నిందితురాలు తన మిత్రురాలి వద్ద నుండి బురఖా తీసుకుంది. ఈనెల 6వతేదిన నిందితురాలు తనను గుర్తుపట్టకుండా బురఖా ధరించి బాధిత వృద్ధురాలి ఇంటికి వెళ్ళి తన మిత్రురాలికి ఇల్లుకిరాయికి కావల్సింది తెలపగా, బాధిత వృద్ధురాలి తన ఇంటి కిరాయి. నిమిత్తం తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడిన అనంతరం. వృద్ధురాలు నిందితురాలికి ఇల్లు చూపిస్తున్న క్రమంలో బురఖా ధరించిన నిందితురాలు తన ఇంటి నుండి తెచ్చుకున్న కారంపొడిని ఒక్కసారిగా బాధిత వృద్ధురాలి కండ్లల్లో చల్లడంతో క్రిందపడిపోయిన వృద్ధురాలి చేతులు కట్టివేసి మెడలోని బంగారు గోలుసును . నిందితురాలు దోపిడీ చేసి అక్కడి నుండి ద్విచక్రవాహనంపై తప్పించుకుంది. చోరీ చేసిన బంగారు అభరణాన్ని మిగితా ఇద్దరు నిందితులైన ఎల్లంబజార్కు చెందిన ప్రేమ్ కుమార్ మరియు హనుమకొండ కుమార్ పల్లికి బెజ్జంకి సురేందర్ కు భాగాలు అమ్మి నిందితురాలు కొద్ది మొత్తం డబ్బు తీసుకోని మిగితా డబ్బుకోసం తిరిగి మళ్ళి వస్తానని వెళ్ళింది. ఈ వృద్ధురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న మీల్స్ కాలనీ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సిసిఎస్ మరియు స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితురాలిని గుర్తించిన పోలీసులు ఈ రోజు ఉదయం నిందితురాలని తన ఇంటిలో అదుపులోకి తీసుకోని విచారించగా నిందితురాలు పాల్పడిన నేరాన్ని అంగీకరించడంతో నిందితురాలు నుండి డబ్బు, ద్విచక్రవాహనం, సెల్ఫోన్, బురఖాను పోలీసులు స్వాధీనం చేసుకోగా, నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు చోరీ సొత్తును కోనుగోలు చేసిన మిగితా ఇద్దరు నిందితుల నుండి 60గ్రాముల బంగారు అభరాణాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపీడీని చేధించడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్ మరియు ఆపరేషన్స్ అదనపు డిసిపి పుష్పా రెడ్డి, క్రైమ్స్ ఏసిపి డేవిడ్గాజు, సిసిఎస్ ఇన్స్స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాస్ రావు, మీల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏ.ఏ.ఓ సల్మాన్ , ఎస్ ఎ.ఎస్.ఐలు శివకుమార్, అశాబీ, హెడాకానిస్టేబుల్ అబిద్, కానిస్టేబుల్ వంశీ చంద్రశేఖర్, అంజయ్య, ఐటీకోర్ కానిస్టేబుల్ నగేష్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :