Saturday, 18 May 2024 09:42:18 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేడు సీబీఐ ముందుకు కవిత..

విచారణలో ఏం చెప్పనున్నారు.? సర్వత్రా ఉత్కంఠ

Date : 11 December 2022 09:04 AM Views : 174

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఆదివారం తెలంగాణ రాజకీయాల్లో కీలక సన్నివేశం చోటు చేసుకోనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై నమోదైన కేసు విచారణలో భాగంగా.. మద్యం పాలసీకి సంబంధించి కవిత దగ్గర ఏదైనా సమాచారం ఉందా అనే కోణంలో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకోనున్నారు. 11 గంటలకు అధికారులు రానున్న నేపథ్యంలో ఆమె నివాసం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో సీబీఐ వివరణ తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం కవిత కేసీఆర్‌ను కలుసుకున్నారు. వీరి మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే సీబీఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఏర్పాటైన ఫ్లెక్సీలు ఆసక్తిగా మారాయి. ‘డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌ విల్‌ నెవర్‌ ఫియర్‌’ అంటూ ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాటు చేశారు. వీరుని కుమార్తె ఎప్పటికీ భయపడదు అనే క్యాప్షన్ తో వెలసిన బ్యానర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే నిజానికి కవిత సీబీఐ అధికారుల ముందు ఈ నెల 6వ తేదీనే హాజరు కావాల్సి ఉంది. కానీ ఆ రోజు కవితకు వేరే కార్యక్రమాలు ఉండటంతో.. అందుబాటులో ఉండలేనంటూ సీబీఐకి లేఖ రాశారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానంటూ లేఖ రాశారు. దీంతో ఆదివారం వివరణ తీసుకునేందుకు అధికారులు వస్తున్నారు. కవితను అధికారులు ఏం ప్రశ్నించబోతున్నారు. ఆమె వారికి ఏం వివరణ ఇవ్వబోతుందనేది ఇప్పుడు పొలిటికల్ టాక్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నుంచి ఆదివారం.. సీబీఐ అధికారులు వివరణ తీసుకోనున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :