Saturday, 18 May 2024 11:37:48 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేడు ఎల్బీ స్టేడియంలో మోదీ బహిరంగ సభ.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

Date : 07 November 2023 11:26 AM Views : 81

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొదటి సారి రాష్ట్రానికి వస్తుండడంతో సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసే పనిలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. ప్రధానితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. అభ్యర్ధు ఖరారు దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు ప్రచారంపై దృష్టి సారించింది. బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళ్లి బహిరంగ సభకు హాజరవుతారు. సభ ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు. సభకు లక్ష మందిని తరలించేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నాయకులు సునీల్ బన్సల్, ఇతర నేతలు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. బీసీ సీఎం అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటుంది. ఇప్పుడు బీసీ ఆత్మ గౌరవ సభలో ప్రధాని ఏం హామీలు ఇస్తారోననేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు ఏ పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటూ బీసీల ఓట్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. బీసీని ముఖ్యమంత్రిని చేసుకునే అవకాశం బీసీలపైనే ఉందంటున్నారు పార్టీ నేతలు. ఎల్బీ స్టేడియంలో ప్రధాన మంత్రి బహిరంగ సభ ఉండడంతో హైదరాబాద్ మహానగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించారు. ముఖ్యంగా బషీర్ బాగ్ నుంచి, ఏఆర్ పెట్రోల్ పంపు నుంచి, గన్ ఫౌండ్రీ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :