Saturday, 18 May 2024 11:57:37 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నవంబర్‌ 11న భేటీకానున్న తెలంగాణ ఇంటర్‌ బోర్డు

Date : 10 November 2022 07:35 PM Views : 200

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ‌ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు అనుబంధ గుర్తింపు పొందని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలపై వేటుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 200 కాలేజీల అఫిలియేషన్‌ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా హైదరాబాద్‌లో నగరంలో వివిధ గృహ, వాణిజ్య సముదాయాల్లో మరో 340కి పైగా కాలేజీలు నడుస్తున్నాయి. ఈ కాలేజీలకు ఎన్‌వోసీ (అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం) రానందున బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. గుర్తింపు పొందని ఈ కాలేజీల్లో విద్యనభ్యసించే విద్యార్థులను ఇంటర్‌బోర్డు లెక్కల్లోకి తీసుకోదు. ఆయా కాలేజీలకు మినహాయింపు ఇవ్వదలిస్తే అది నేరుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐతే ప్రతీ ఏటా ఇలా అనుమతి ఇవ్వడం మూలంగా సంఖ్యకు మించి జూనియర్‌ కాలేజీలు వెలిసినట్లు, ముగింపు ఎప్పుడని బోర్డు ఇన్‌ఛార్జి సెక్రటరీ నవీన్‌ మిత్తల్‌ భావించారు. నిజానికి విద్యామంత్రి సబిత ఈ కాలేజీలకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, నవీన్‌ మిత్తల్‌ అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గుర్తింపు పొందకుండా నడుపుతున్న కాలేజీల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరానికి సదరు కాలేజీలకు అనుమతి నిరాకరించాలని, వాటిల్లో విద్యనభ్యసిస్తున్న లక్ష మంది విద్యార్థులతో రెగ్యులర్‌గా పరీక్ష రాయించడానికి బదులు.. ప్రైవేట్‌గా (హాజరు మినహాయింపు తీసుకొని నేరుగా పరీక్ష రాసేవిధానం) పరీక్షలు రాయించాలని ఆయన భావిస్తున్నారు. ఈ పద్ధతి కేవలం ఆర్ట్స్‌ గ్రూపులు చదువుతున్న విద్యార్ధులకు మాత్రమే. ఇక సైన్స్‌ గ్రూపుల విద్యార్ధుల సంగతేంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. పైగా అఫిలియేషన్‌ లేని కాలేజీల్లో వేలమంది సైన్స్‌ గ్రూపుల్లోనే చదువుతున్నారు. దీనిపై న‌వంబ‌రు 11న ఇంటర్‌బోర్డు పాలక మండలితో చర్చించనుంది. ఐతే సుమారు అయిదేళ్ల తర్వాత (2017) సమావేశంకానున్న ఇంటర్‌బోర్డు పాలకమండలి అయిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1500 – 2000 అంశాల ఆమోదం కోసం బోర్డు ఎదురుచూస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :