Saturday, 18 May 2024 11:37:53 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

‘రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్’.. నేడే బీజేపీ మేనిఫెస్టో..

Date : 18 November 2023 08:05 AM Views : 63

జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలతో ప్రజలను ఆకర్షించగా.. టీబీజేపీ ‘గేమ్ చేంజర్’గా తమ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మేనిఫెస్టోలకు ధీటుగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా కమలనాథులు మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ మోదీ గ్యారంటీ నినాదంతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. నారీ శక్తి పేరిట అమలు చేస్తున్న పథకంలో భాగంగా ప్రతీ వివాహితకు ఏడాదికి రూ.12 వేల చొప్పున అందిస్తామని హామీ ఇవ్వబోతోంది. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించనుంది. కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చే హామీ కూడా ఇవ్వనుంది.యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్‌సీ జాబ్‌ క్యాలెండర్‌, అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం హామీ ఇస్తారని తెలుస్తోంది. ప్రతి వ్యక్తికి జీవిత భీమా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అర్హులైన పేదలకు ఇళ్లు హామీని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఐఐటి ఎయిమ్స్ తరహాలో విద్యాసంస్థల ఏర్పాటు, ఫ్రీ విద్యుత్ పథకం రజక, నాయిబ్రాహ్మణులకు వర్తింపచేస్తామని హామీ ఇవ్వనున్నారు. బీసీ సబ్ ప్లాన్ అమలుపై కూడా హామీ ఇవ్వనున్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విడుదల చేయనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల భూములు లాక్కుని పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ప్రచారం చేస్తున్న కమలనాథులు తమ మ్యానిఫెస్టోలో దానికి ప్రత్యామ్నాయం చూపుతారని అంతా భావిస్తున్నారు. మరో రెండు వారాల్లో ఎన్నికలు ఉండటంతో బీజేపీ గేమ్‌ చేంజర్‌గా మేనిఫెస్టోను రూపొందించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని శ్రీ @narendramodi గారి నేతృత్వంలో సుపరిపాలన, పేదల సంక్షేమం, తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం బిజెపి మేనిఫెస్టోను విడుదల చేయనున్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ @AmitShah గారు.#TelanganaWithBJP pic.twitter.com/RJIdQqAtnh — BJP Telangana (@BJP4Telangana) November 17, 2023

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :