Saturday, 18 May 2024 10:08:39 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సచ్ఛీలురెందరు.. నేరస్థులెందరు? తెలంగాణ ఎమ్మెల్యేల నేరచరితపై ADR సంచలన రిపోర్ట్

Date : 29 October 2023 09:31 AM Views : 70

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ దంగల్ కీలక దశకు చేరుకుంది. అన్ని పార్టీలూ అభ్యర్థుల జాబితాల్ని దాదాపుగా పూర్తి చేసినట్టే. వాట్ నెక్స్ట్ అంటే ఇంకేముంది… నామినేషన్ల పర్వమేగా? ఇదే గ్యాప్‌లో అభ్యర్థులంతా డీజీపీ ఆఫీసుకు క్యూ కట్టేశారట. మేమెంత స్వచ్ఛమైన నేతలం… మా మీదుండే కేసులెన్ని… కొట్టివేసిన కేసులెన్ని.. చెప్పండి మహాప్రభో అంటూ ఆరా తీస్తున్నారట. ఎందుకని? వీళ్ల నేర చరితకు, నామినేషన్ల ఘట్టానికి ఉండే లింకేంటి?.. తెలంగాణ దంగల్‌ ముంచుకొస్తోంది. మరో నెలరోజుల్లో పోలింగ్ టైమ్‌. నవంబర్ 10 నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. పోటీలో నిలిచే అభ్యర్థులు ఆలోగా తమతమ బయోడేటాలతో సమగ్రమైన సమాచారంతో అఫిడవిట్‌తో కూడిన నామినేషన్లు సమర్పించాలి. ప్రస్తుత ఎమ్మెల్యేల గుణగణాలు, వారివారి నేర చరిత్రలపై ప్రత్యేక అధ్యయనం చేసింది అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్‌.. ADR. ఇందులో విస్తుగొలిపే అంశాలు అనేకం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా రూపొందించిన నివేదిక ఇది. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలపై కేసుల వివరాల్ని పరిశీలిస్తే… అందులో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. మొత్తం 118 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో అత్యధికంగా అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైనే ఎక్కువ కేసులు ఉన్నట్టు చెబుతోంది ADR రిపోర్ట్. 118 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఏకంగా 72 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 46 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరానికి పాల్పడ్డట్టు అభియోగాలున్నాయి. అటెంప్ట్ టు మర్డర్… అంటే హత్యాయత్నం కేసులున్న ఎమ్మెల్యేలు ఏడుగురు. నలుగురు ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన కేసులున్నాయి. ఈ నలుగురిలో ఒక ఎమ్మెల్యేపై రేప్ కేసులున్నట్టు ADR రిపోర్ట్ చెబుతోంది. బీఆర్ఎస్‌కి చెందిన 101 ఎమ్మెల్యేల్లో 59 మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో 38 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. ఏడుగురు MIM ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, బీజేపీలో ఇద్దరు ఎమ్మల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ రిపోర్ట్ లో పేర్కొంది. ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసుల విచారణ కోసం 2018 తర్వాత రాష్ట్రానికో ప్రత్యేక కోర్టును కేటాయించింది సుప్రీంకోర్టు. ఇందులో ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించిన విచారణ ప్రతిరోజూ జరుగుతూ వస్తోంది. గత నాలుగేళ్లలో జరిగిన విచారణ తర్వాత ఎన్ని కేసులు క్లియరయ్యాయి.. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి అనేది తేలాల్సిన లెక్క. కానీ.. ఈ తాజా వివరాలతోనే అభ్యర్థులు నామినేషన్ల సమయంలో అఫిడవిట్లు రాసివ్వాల్సి ఉంది. అందుకే… ప్రస్తుతం తమపై ఎన్ని కేసులున్నాయో చెప్పాలంటూ నేతలంతా డీజీపీ ఆఫీసుకు క్యూలు కడుతున్నారు. డీజీపీ ఆఫీస్ నుంచి వివరాలు తీసుకున్న తర్వాతే నామినేషన్లు దాఖలౌతాయ్. ఏ అభ్యర్థి ఎంత సచ్ఛీలుడు.. ఎంతటి నేరచరితుడో తేలేది కూడా అప్పుడే.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :