Saturday, 18 May 2024 11:37:49 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత.. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక ప్రకటన

Date : 20 October 2023 08:17 PM Views : 72

జై భీమ్ టీవీ - తెలంగాణ / : రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. తాజాగా కానిస్టేబుల్ అభ్యర్ధుల నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని సూచిస్తూ తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) (TSLPRB) పోలీస్‌ కమిషనర్లకు, ఎస్పీలకు సూచించింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. కాగా కానిస్టేబుల్‌ కొలువులకు ఎంపికైన అభ్యర్ధులు ఇప్పటికే శారీరక సామర్థ్య, రాత పరీక్షల్లో అర్హత సాధించారు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన వీరందరికీ పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షలను నిర్వహించి శిక్షణకు పంపించేందుకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అయితే తుది ఎంపిక సరిగా లేదని, హడావిడిగా అభ్యర్ధులను ఎంపిక చేశారంటూ పలువురు అభ్యర్థులు కొద్దిరోజుల క్రితం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పైగా క్వశ్చన్‌ పేపర్‌లో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ పలువురు అభ్యర్ధులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. తప్పుగా ఇచ్చిన ఆ నాలుగు మార్కులను కలిపిన తర్వాత మరోసారి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెలువరించాలని వారు కోర్టును కోరారు. ఆ మేరకు నాలుగు మార్కులు కలిపి.. మరోమారు తుది ఎంపిక జాబితా ప్రకటించాలని కోర్టు అక్టోబ‌రు మొదటి వారంలో ఉత్తర్వులిచ్చింది. అయితే మార్కుల్ని కలిపే ప్రక్రియపై కసరత్తు పూర్తి చేయకుండానే రిక్రూట్‌మెంట్‌ బోర్డు అభ్యర్ధుల పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్యపరీక్షలనూ నిర్వహిస్తోందంటూ పిటిషనర్లు మరోమారు న్యాయస్థానం తలుపుతు తట్టారు. దీంతో అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయస్థానం అక్టోబ‌రు 19న‌ ఆదేశాలు జారీ చేసింది. Viral Video: ఛీ.. యాక్‌! రైలు వంటగదిలో ఎలుకల స్వైర విహారం.. రైల్వే అధికారుల స్పందన ఇదే కేంద్రీయ విద్యాలయ పీఆర్‌టీ రాత పరీక్ష ఫలితాలు విడుదల దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీఎస్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను కేవీ సంగఠన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను తాజా విడుదల చేసింది. మొత్తం 6414 టీచర్‌ కొలువులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కేవీఎస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :