Saturday, 22 March 2025 05:48:54 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ఏపీకా? తెలంగాణకా? హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ!

Date : 20 January 2023 10:36 AM Views : 340

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సహా మొత్తం 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ రాష్ట్ర కేడర్ అవుతారనే దానిపై ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఈ 11 మంది కేంద్ర సర్వీసు అధికారులకు ఏపీ కేడర్ ఖరారైంది. కానీ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వీరంతా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌‌లో అప్పీల్ చేసుకున్నారు. తెలంగాణలో పనిచేసేలా అప్పుడు క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారం ఇవాళ కొలిక్కి రాబోతోంది. ఇటీవలే సోమేశ్ కుమార్‌ను ఏపీ కేడర్‌గా ప్రకటించి, గతంలో క్యాట్ వెలువరించిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఏపీకి బదిలీ చేసింది.హైకోర్ట్. ఈ నేపథ్యంలో ఇవాళ ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్.. ఇక్కడే ఉంటారా లేక ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయా అనేది ఆసక్తిగా మారింది. ఈ 11 మందిలో 9 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉండగా.. వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి సహా పలువురు అధికారులు ఉన్నారు. ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారించిన హైకోర్టు.. ఏపీకి వెళ్లాల్సిందిగా సోమేష్‌ కుమార్‌ను ఆదేశించింది. దాంతో ఆయన ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక 11 మంది ఐఏఎస్ అధికారుల వంతు వచ్చింది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :