Saturday, 18 May 2024 12:36:35 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రవల్లిక ఆత్మహత్య.. బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు

Date : 15 October 2023 08:13 AM Views : 82

జై భీమ్ టీవీ - తెలంగాణ / : అశోక్ నగర్‌లోని హాస్టల్లో వరంగల్‌కు చెందిన ప్రవళిక అనే యువతి శుక్రవారం సాయంత్రం 8:30 ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను రాసిన సూసైడ్ లెటర్ లో తన కుటుంబానికి భారం కాదల్చుకోవట్లేదని, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, నన్ను క్షమించాలంటూ రాసింది. అయితే ప్రవల్లిక ఆత్మహత్యకు రద్దయిన టిఎస్పిఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్ ఏ కారణం అంటూ ఆందోళన మొదలైంది. నిన్న రాత్రి వందలాదిమంది విద్యార్థులు నిరుద్యోగులు ప్రవళిక హాస్టల్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. మధ్యరాత్రి వరకు పరిస్థితి ఉధృతంగా మారింది. ఇక ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్య అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తింది. పలువురు కాంగ్రెస్ నేతలు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. గురువారం జరిగినటువంటి సంఘటన నిరుద్యోగ యువతి ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య ఎందుకంటే తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రభుత్వం వైఫల్యమే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గత తొమ్మిది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడంలో వైఫల్యం అయ్యిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లను టీఎస్పీఎస్ ద్వారా పరీక్షలు నిర్వహించడంలో కూడా విఫలమయ్యారు. పరీక్షల తేదీలను నిర్ణయిస్తూ పదేపదే వాయిదాలు వేస్తూ పెట్టిన పరీక్షలకు పేపర్ లీకులు చేస్తూ ఇలాగా అన్ని విషయాల్లో విఫలం చెందారు. నిరుద్యోగ యువత యువకులు విద్యార్థులు తల్లిదండ్రులకు భారమై దూర ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్ నగరంలో కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ప్రతిసారి పరీక్ష రాసి మళ్ళీ అవి రద్దు అయి మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రులకు భారమై పరీక్షలు వాయిదా పడడంతో మనస్థాపన గురవుతున్నారు ప్రవల్లిక ఆత్మహత్య కూడా ఇదే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదం తో తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు నియామకాల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని, ఈసారి ఎన్నికల్లో తెలంగాణ టిఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ అంటుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :