Saturday, 18 May 2024 11:37:49 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బుల్లెట్‌ టూ బ్యాలెట్‌.. ప్రజాక్షేత్రంలోకి గాజర్ల అశోక్ అలియాస్ ఐతు

Date : 16 October 2023 09:43 AM Views : 85

జై భీమ్ టీవీ - తెలంగాణ / : మావోయిస్ట్ ఉద్యమానికి ఊపిరులూదిన వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు ప్రజాక్షేత్రంలోకి అడుగిడుతున్నారు. తాడిత పీడిత ప్రజల కోసం 25 ఏళ్ల తన ఉద్యమ ప్రస్థానాన్ని వీడి రాజకీయాల్లోకి వచ్చారు. కుటుంబ వారసత్వంగా వచ్చిన ఉద్యమ నేపథ్యాన్ని బలం, బలగంగా మార్చుకుంటూ.. నేను సైతం అంటూ ప్రజాక్షేత్రంలోకి దిగాడు ఐతు అలియాస్ గాజర్ల అశోక్. అప్పటి వరంగల్‌ ప్రస్తుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామం అంటేనే గుర్తుకు వచ్చేది ‘గాజర్ల’ కుంటుంబం. అప్పటి పీపుల్స్‌వార్‌.. ఇప్పటి మావోయిస్టు పార్టీకి అంకితమైన కుటుంబం అది. ఆ కుటుంబానికి చెందిన వారంతా అప్పటి పరిస్థితులలో దొరల పాలనకు.. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారే. ప్రజలలో చైతన్యం తెచ్చి హక్కుల కోసం పోరాడిన యోధులే. వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల కనకమ్మ–మల్లయ్య దంపతులకు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్‌లు సంతానం. వారికున్న ఎనిమిదెకరాల భూమితోపాటు గీత వృత్తి ఆ కుటుంబానికి ఆధారం. పెద్ద కొడుకు రాజయ్య అనారోగ్యంతో మరణించగా.. రెండవ కొడుకు సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. అప్పటికే వారి తల్లిదండ్రులు కనకమ్మ–మల్లయ్యలు కన్నుమూయడంతో మిగతా వారు సారయ్య, రవి, అశోక్‌లు విప్లవపంథాను ఎంచుకుని పీడిత ప్రజల నాలుకలలో నానుతున్నారు. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి 1989లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. అయితే అప్పుడు పోలీసుల నిర్భందం, వేధింపులు, అణచివేత మూలంగా 1992లో గాజర్ల రవి అలియాస్‌ గణేష్, 1994లో గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతులు కూడా అన్నల బాట పట్టారు. మావోయిస్ట్ ఉద్యమంలో అమరులైన ఆజాద్‌, రమ పీపుల్స్‌వార్‌లో చేరిన గాజర్ల సారయ్య అలియాస్‌ భాస్కర్‌ పేరిట చిట్యాల దళ కమాండర్‌గా పని చేసి అంచలంచెలుగా ఎదిగి పీపుల్స్‌వార్‌ నుంచి మావోయిస్టు పార్టీగా మారిన పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్‌గా, మిలటరీ ప్లాటూన్‌ కమాండర్‌గా పనిచేసి ఏటూరునాగారం అటవీప్రాంతం కంతనపల్లి అడవుల్లో 2008 ఏప్రిల్‌ 2న జరిగిన ఎన్‌కౌంటర్‌లో తన సహచరి రమతోపాటు ఊపిరి వదిలారు. ఆ ఎన్‌కౌంటర్‌ ఇప్పటికీ సంచలనంగా మిగిలిపోగా న్యాయ విచారణ సైతం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల ప్రతినిధిగా గణేష్‌ ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2004–05లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చలలో అప్పటి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి పార్టీ తరుపున ప్రతినిధిగా పాల్గొన్నారు గాజర్ల అశోక్ అలియాస్ గణేష్. అప్పటికే ఆయన ఆంధ్ర–ఒడిశా బార్డర్‌ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే అప్పటి ప్రభుత్వ విధానాలతో పార్టీకి పొసగకపోవడంతో తిరిగి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే ప్రతిసారీ ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా గాజర్ల సోదరుల పేర్లు వినబడడం చిట్యాల ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. మెరుపుదాడులు చేయడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో ముగ్గురు ‘గాజర్ల’ సోదరులు ఆరితేరిన వారుగా ఇప్పటికీ పార్టీలో, పోలీసు వర్గాలలో పేరుంది. కొద్దిరోజుల క్రితమే ఆరోగ్య కారణాలతో మావోయిస్టు పార్టీని వీడిన గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కీలకంగా మారింది. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక చేరడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :