Saturday, 19 April 2025 05:13:46 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

హౌసింగ్ ఫర్ ఆల్.. హోంలోన్‌ తీసుకునేవాళ్లకి BRS బంపర్ ఆఫర్.. కేటీఆర్ సంచలన ప్రకటన..

Date : 25 November 2023 08:15 AM Views : 458

జై భీమ్ టీవీ - తెలంగాణ / : అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణ ప్రజలకు BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ గుడ్ న్యూస్‌ చెప్పారు. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఆకర్షణీయమైన పథకాలు, హామీలతో మేనిఫెస్టో ప్రకటిలంచిన BRS పార్టీ..త్వరలోనే ఇంకో కొత్త పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు. HICCలో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌-2023లో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. BRS ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదిన్నరేళ్లలో కొవిడ్‌, ఎన్నికలు, ఇతర కారణాలతో కేవలం ఆరున్నరేళ్లు మాత్రమే పరిపాలించామని కేటీఆర్‌ చెప్పారు. ఇక కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నవారి కోసం సరికొత్త పథకాన్ని ఆఫర్‌ చేశారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యంతో BRS సర్కార్‌ ఉందన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదం పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నది తమ ఉద్దేశ్యమని కేటీఆర్‌ పేర్కొన్నారు. అయితే..ఈ హౌసింగ్ ఫర్ ఆల్ అంటే..డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తారా అని డౌట్ రావచ్చని.. బుల్ బెడ్ రూం ఇండ్లు, గృహలక్ష్మి రెండూ ఉంటాయని..వాటితో పాటుగా మరో కొత్త పథకాన్ని కూడా కేసీఆర్ ఆలోచించారని కేటీఆర్ తెలిపారు. వీడియో చూడండి.. కొత్తగా ఇళ్లు కొనాలనుకుంటున్న మధ్యతరగతి కుటుంబాల కోసం త్వరలోనే కొత్త పథకం తీసుకురాబోతున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఎవరైతే లోన్ తీసుకుని ఇండ్లు కొనుక్కోవాలనుకునే మిడిల్ క్లాస్ వారి కోసం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చూస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఆ లోన్‌‌కు సంబంధించిన ఇంట్రెస్ట్‌ను ప్రభుత్వమే కట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :