జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలంయ ప్రారంభమైంది. ఏప్రిల్ 30వ తేదీన అత్యంత వైభవోపేతంగా నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు..మంత్రులు కొన్ని ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి పాలనను ప్రారంభించారు. ఈ క్రమంలోనే కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సమీక్ష జరపబోతున్నారు. మే 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం కీలక అంశంపై మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. దేనిపై సమీక్ష..? పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు, కరివేన, ఉద్దండాపూర్ కాల్వల విస్తరణ పనులతో పాటు ఉద్దండాపూర్ నుంచి తాగునీరు తరలింపు పనులపై కేసీఆర్ సమీక్షించనున్నారు. కొడంగల్, వికారాబాద్ వేళ్లే కాల్వల పనులపై కూడా సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
Admin