Saturday, 18 May 2024 10:28:08 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

దేశ విభజన చారిత్రక తప్పిదం.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

Date : 17 October 2023 01:02 PM Views : 75

జై భీమ్ టీవీ - తెలంగాణ / : దేశ విభజనపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని విభజించి ఉండాల్సింది కాదని అన్నారు. ఇది చారిత్రక తప్పిదమని ఎంపీ పేర్కొన్నారు. చారిత్రాత్మకంగా ఇది ఒక దేశం.. దురదృష్టవశాత్తూ విభజనకు గురైందని, అలా జరిగి ఉండకుంటే బాగుండేదన్నారు ఒవైసీ. అయితే, దేశ విభజన మహ్మద్ అలీ జిన్నా వల్ల కాదని, హిందూ మహాసభ డిమాండ్ మేరకే భారత్, పాకిస్థాన్‌లు ఏర్పాటయ్యాయని ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఏఐఎంఐఎం చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.. దేశ విభజన చారిత్రక తప్పిదమని, దీనికి తాను ఒక్క లైన్‌లో సమాధానం చెప్పలేనని ఒవైసీ అన్నారు. దేశ విభజన నాటి నాయకులే దీనికి బాధ్యత వహించాలని, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ పుస్తకాన్ని చదవాలని సూచించారు. చారిత్రక తప్పిదానికి ఒక్క లైన్‌లో సమాధానం చెప్పలేను – అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఒక్కటే చెప్పగలను.. కావాలంటే.. దీనిపై చర్చ నిర్వహించి.. దేశ విభజనకు అసలు బాధ్యులు ఎవరో చెబుతాను. ఆ సమయంలో “ఒక్క లైన్‌లో పొరపాటున స్పందించలేను.” స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ రచించిన ‘ఇండియా విన్స్‌ ఫ్రీడమ్‌’ పుస్తకాన్ని చదవాలని, తాను కాంగ్రెస్‌ నేతల వద్దకు వెళ్లి విభజన ప్రతిపాదనను అంగీకరించవద్దని ఎలా అభ్యర్థించానో చెప్పాలని సూచించినట్లుగా ఆ పుస్తకంలో ఆయన చెప్పారని ఒవైసీ గుర్తు చేశారు. ఈ దేశాన్ని విభజించి ఉండాల్సింది కాదు.. విభజన తప్పని.. ఆ సమయంలో అక్కడ ఉన్న నేతలంతా ఇందుకు బాధ్యులని.. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ రాసిన ఇండియా విన్స్‌ ఫ్రీడమ్‌ పుస్తకాన్ని చదివితే.. కాంగ్రెస్‌ నేతలందరినీ మౌలానా ఆజాద్‌ అభ్యర్థన అర్థమవుతుందని ఒవైసీ అన్నారు. వచ్చే నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అసదుద్దీన్ ఈ ప్రకటన కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో నవంబర్ 30న ఓటింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. బీజేపీతో పాటు కాంగ్రెస్‌పై కూడా ఒవైసీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :