Saturday, 18 May 2024 11:19:46 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కర్నాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పీసీసీ చీఫ్​ రేవంత్​

Date : 04 May 2023 12:14 PM Views : 142

జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దాంతో పాటు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని చెప్పారు. బుధవారం కర్నాటకలోని అలంద్​, చించోలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఏఐసీసీ చీఫ్​ ఖర్గే నాయకత్వంలో హిమాచల్​ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచామని, ఇప్పుడు కర్నాటకలో 150 సీట్లు గెలుస్తామన్నారు. ఏ అవసరమొచ్చినా కొడంగల్​కు రావొచ్చని, అక్కడ కుదరకపోతే హైదరాబాద్​కైనా రావొచ్చని ఆయా నియోజకవర్గాల ప్రజలకు సూచించారు. కర్నాటకలో 40 శాతం కమీషన్ సర్కారును బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చెప్పినట్టు కర్నాటకలో అభివృద్ధి జరిగే ఉంటే.. వాళ్లొచ్చి ప్రచారం చేయడమెందుకని రేవంత్ ప్రశ్నించారు. ఏ హామీలనూ నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వాళ్లు ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. కర్నాటక బిడ్డ మల్లికార్జున ఖర్గేని బీజేపీ కుట్ర చేసి ఓడించిందని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనకు ఏఐసీసీ అధ్యక్ష పదవినిచ్చి గౌరవించిందన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఇందిరాగాంధీ వంటి వారు అధిష్ఠించిన ఏఐసీసీ చీఫ్ పదవిలో ఆయన్ను కూర్చోబెట్టిందన్నారు. కర్నాటక భూమి పుత్రుడైన ఖర్గే వెంట కన్నడ ప్రజలంతా నడవాల్సిన అవసరం ఉందన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :