Saturday, 18 May 2024 11:57:36 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

యూట్యూబరా..? క్రికెట్ బెట్టింగ్ ముఠానా..? విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదంలో వెలుగులోకి షాకింగ్‌ నిజాలు..

Date : 21 November 2023 09:23 AM Views : 106

జై భీమ్ టీవీ - తెలంగాణ / : విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదంపై.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణలో షాకింగ్‌ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఫిషింగ్‌ హార్బర్‌లో అర్థరాత్రి లంగర్‌ వేసిన బోటులో పార్టీ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాకుండా… క్రికెట్ బెట్టింగ్, గొడవల నేపథ్యంలో ఘటన జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించి మొదట యూ ట్యూబర్‌, లోకల్‌ బాయ్‌ నానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి ప్రమాద ప్రాంతంలోని బోటులో స్నేహితులతో కలిసి యూట్యూబర్‌ నాని ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.. అయితే, లోకల్‌ బాయ్‌ నాని పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తున్న అతనికి బోటు ఉంది. ఆరోజే అతడి భార్యకు ఘనంగా సీమంతం నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్రెండ్స్‌ కూడా పార్టీ అడగడంతో ఆదివారం రాత్రి బోటులో మందు పార్టీ ఇచ్చాడు నాని. ఈ పార్టీలో జరిగిన గొడవతో కావాలనే కొంతమంది బోటుకు నిప్పు అంటించారని..అది ఇతర బోట్లకు అంటుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బోటు అమ్మకానికి పెట్టిన క్రమంలో అడ్వాన్స్‌ విషయంలో జరిగిన వివాదం కూడా ఘటనకు కారణం అన్న వాదన వినిపిస్తోంది. యూ ట్యూబ్‌లో లోకల్ బాయ్ నానిగా గుర్తింపు పొందాడు. సముద్రంపై వేటకు వెళ్లి.. వలకు పడిన చేపల దృశ్యాలను.. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తాడు. ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ బాయ్ నాని ఈ ప్రమాద దృశ్యాలను షూట్ చేసి తన యూ ట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో, ఎవరు కారకులో తెలియడం లేదని నాని ఆ వీడియోలో చెప్పాడు. అయితే ప్రమాద సమయంలో తాను అక్కడ లేనని నాని చెబుతున్నాడు. ఆ సమయంలో అక్కడ లేకపోతే అగ్ని ప్రమాద సంఘటనను నాని వీడియో తీసి యూ ట్యూబ్‌లో ఎలా పెట్టాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై యూ ట్యూబర్‌ నానీని పోలీసులు విచారించారు. అయితే, మొదటి బోట్ తగలబడిన సమయం రాత్రి 11.15 గంటలుగా పోలీసులు గుర్తించారు. 11.45 గంటలకు నాని అక్కడకి వచ్చినట్టు మొబైల్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకున్నారు. తన బోట్ కాలిపోతుందన్న సమాచారంతోనే అక్కడకు వెళ్లానని నాని పోలీసులకు తెలిపాడు. ఆ టైమ్‌లో నాని ఎటు వెళ్లాడు.. మొబైల్ లొకేషన్‌ను ఎక్కడ ఉంది అనే దానిపై కూడా పోలీసులు చెక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలుత నాని చూట్టూ సాగిన విచారణ.. మళ్లీ క్రికెట్ బెట్టింగ్ వైపు మళ్లింది. క్రికెట్ బెట్టింగ్, గొడవల నేపథ్యంలో ఘటన జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. బెట్టింగ్ ముఠాల మధ్య ఘర్షణ నేపథ్యంలోనే ప్రమాదం జరిగిందన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడ్డ స్థానిక యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తానికి..విశాఖ షిఫింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదం మొత్తం లోకల్‌బాయ్‌ నాని చుట్టూనే తిరుగుతోంది. మరి పోలీసులు చివరకు ఏం తేలుస్తారో చూడాలి. వీడియో చూడండి.. ఇదిలాఉంటే.. అగ్ని ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లినట్ల అధికారులు పేర్కొంటున్నారు. చేపలతో పాటు 40 బోట్లు కాలిబూడిదయ్యాయి. అంతేకాకుండా మరో 40 బోట్లు ధ్వంసమైనట్లు పేర్కొంటున్నారు. కాగా.. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారణకు ఆదేశించారు. మత్స్యకారులను ఆదుకోవాలని సూచించారు. కాగా.. కాలిన బోట్లకు సర్కారు పరిహారం ఇవ్వనుంది. విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని, మత్స్యకారులకి అండగా ఉండాలని జగన్‌ అధికారులను ఆదేశించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :