Saturday, 18 May 2024 09:42:10 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

గుహలో చిక్కుకున్న యువకుడి కోసం భారీ రెస్క్యూ

Date : 15 December 2022 11:10 AM Views : 197

జై భీమ్ టీవీ - తెలంగాణ / కామారెడ్డి జిల్లా : ఒకటి కాదు.. రెండు కాదు.. 40గంటలు..రాజు బండరాళ్ల మధ్య గుహలో ఇరుక్కుపోయి 40 గంటలు గడుస్తోంది. తలకిందులుగా చిక్కుకుపోయి ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. బయటకు రాలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. 40గంటలుగా నీళ్లు లేవు, ఆహారం లేదు. తనని కాపాడాలంటూ వేడుకుంటున్నాడు బాధితుడు.. కామారెడ్డి.. సింగరాయిపల్లి గుహ లోపల బండరాళ్ల మధ్య చిక్కుకొని నరకయాతన అనుభవిస్తున్నాడు. బయటకు కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. పక్కనున్న బండరాళ్లను తొలగించి రాజును క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గుహ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. డ్రిల్లింగ్‌ మిషన్ల సాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. బాధితుడికి ఆక్సిజన్‌, ఫ్లూయిడ్స్‌ పంపిస్తున్నారు అధికారులు. రాజును బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొబ్బరినూనెను సైతం వినియోగిస్తున్నారు. బండరాళ్లను పేల్చివేస్తూ.. కాపాడేందుకు దాదాపు 50 మందికి పైగా సిబ్బంది రెస్క్యూ నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన రాజు మంగళవారం వేటకు వెళ్లి గుహలో ఇరుక్కుపోయాడు. కింద పడిపోయిన ఫోన్‌ తీసేందుకు యత్నించి మరింత లోతుకు వెళ్లిపోయాడు. ఎంత ప్రయత్నించినా రాజు బయటకు రాలేకపోయాడు. తనను కాపాడాలంటూ అరుపులు కేకలు వేశాడు. రాజు అరుపులు విన్న కొందరు స్థానికులు..అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజును రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీల సాయంతో రాళ్లను తొలగిస్తున్నారు. పెద్ద పెద్ద రాళ్లను పేల్చివేస్తున్నారు. రాజు గుహలో పడి దాదాపు 40 గంటలవుతోంది. రాజు ‌ వేటకు వెళ్లిన కారణంతో మొదట అధికారులకు సమాచారం ఇవ్వలేదు. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ మాత్రమే నిన్న మధ్యాహ్నం వరకు ప్రయత్నించారు.. వీలుకాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజును బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. కాగా.. తన కొడుకును తొందరగా బయటకు తీసుకురావాలని రాజు తల్లి కోరుతోంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి గుట్ట దగ్గరకే కుటుంబసభ్యులు ఉంటున్నారు. రాజును ఎప్పుడూ బయటకు వస్తాడా? అని ఎదురు చూస్తున్నారు. రాజు బయటకు రాకపోవడంతో నిన్న అతని స్నేహితుడు అశోక్‌ గుహలోకి దిగాడు. మధ్యలో దాకా వెళ్లే ధైర్యం చెప్పి వచ్చాడు. బ్లాస్ట్‌ చేసినా ప్రమాదం లేకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు అతనికి ఫ్లూయిడ్స్‌ కూడా అందిస్తూ ధైర్యం చెబుతున్నామని డాక్టర్‌ తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :