Saturday, 18 May 2024 11:37:58 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బీఆర్ఎస్ ఒంటరి కాదు.. బీజేపీ, ఎంఐఎం తోడుగా ఉన్నాయ్.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

Date : 19 October 2023 06:54 PM Views : 70

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ.. రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుర్పించారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నాయంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ ఒంటరి కాదని.. బీజేపీ, ఎంఐఎం దానితో కలిసే ఉంటాయంటూ ఫైర్ అయ్యారు. తాను బీజేపీపై పోరాడుతున్నందుకే.. తనపై బీజేపీ ప్రభుత్వం 24 కేసులు పెట్టిందంటూ పేర్కొన్నారు. తన ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారని, ఇల్లు కూడా లాక్కున్నారంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా.. పార్లమెంట్‌లో మాట్లాడడానికి మైక్‌ కూడా ఇవ్వరంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై కేంద్రం ఒక్క కేసు పెట్టలేదన్నారు. కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ దాడులు చేయలేదంటూ రాహుల్‌ వివరించారు. కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయడం లేదంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబపాలనతో తెలంగాణకు తీవ్రనష్టమంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ సహాయ పడుతోందంటూ ఆరోపించారు. తెలంగాణలో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని.. పార్లమెంట్‌లో ప్రతి బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందంటూ రాహుల్‌ అభిప్రాయపడ్డారు. కర్నాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం.. దేశమంతా కాంగ్రెస్‌ గాలి వీస్తోందంటూ పేర్కొన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతారని.. ఇది దొరల తెలంగాణ, ప్రజా తెలంగాణ మధ్య పోరు అంటూ రాహుల్ పేర్కొన్నారు. బీజేపీతో పోరాడుతున్నానని.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వారు తనపై విమర్శలు గుప్పిస్తుంటే తన పోరాటం ఎంటో అర్థం అవుతోందంటూ రాహుల్ గాంధీ వివరించారు. ఈ పోరాటం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోందని.. కచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ రాహుల్ పేర్కొన్నారు. ఇక్కడ కేసీఆర్ ఓటమి తప్పదని.. త్వరలోనే ప్రజా పాలన ఏర్పడుతుందంటూ ధీమా వ్యక్తంచేశారు. పార్లమెంట్‌లో ఓబీసీలు ఎంత మంది ఉన్నారని నిలదీశానని.. దేశాన్ని 90 మంది అధికారులు మాత్రమే పరిపాలిస్తున్నారని.. అందులో ఓబీసీలు కేవలం ముగ్గురేనంటూ మరోసారి పేర్కొన్నారు. అందుకే దేశానికి ఎక్స్‌రే అవసరమని చెబుతున్నానని.. డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఏ రోగమో తెలియాలంటే ఎక్స్‌రే తీసుకు రమ్మంటారు.. అందుకే.. తమ ప్రభుత్వం రాగానే ముందుగా కులగణన చేపట్టే పని చేస్తామంటూ రాహుల్‌.. కులగణన గురించి వివరించారు. అందుకే తాము కులగణన కోసం పోరాడుతున్నామని తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :