Saturday, 18 May 2024 01:11:20 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రేపో.. మాపో పులి బయటకు వస్తుంది.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..?

Date : 10 October 2023 09:29 AM Views : 73

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జ్వరంతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారని.. రేపో మాపో పూర్తిగా జనంలోకి రాబోతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని కొందరు ప్రజలు ఆందోళన చెందుతున్నారని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆయన బయటికి వస్తే ఈ గుంట నక్కలు – తోడేళ్లని తోక ముడుచుకొని తొర్రలోకి వెళ్లాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీలపై ఫైర్ అయ్యారు. సోమవారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ .. భూపాలపల్లి, పరకాల, తొర్రూరులో ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్స్ అని ప్రజల్లోకి వస్తుందని కొత్తగా ఏం వొరగ పెడతారంటూ ప్రశ్నించారు.. మళ్లీ కొత్త నాటకాలతో ప్రజల వద్దకు వస్తున్న వారిని నిలదీయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల నేతలు ఇప్పటికే జనం మధ్యకు వస్తున్నారని, జాతీయ నేతలు కూడా బహిరంగ సభలతో హడావుడి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలు కేసీఆర్ ఏం చెప్తారోనని ఉత్కంఠతగా ఎదురుచూస్తున్నారని అన్నారు. కేసీఆర్ జ్వరం నుండి పూర్తిగా కోలుకున్నారని రేపు మాపో జనం మధ్యకు రాబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్- బీజేపీ నాయకులు డబ్బులు, డాలర్లు ఎన్ని ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయాలంటూ కోరారు. పులి బయటకు వస్తే.. ఇప్పుడు హడావుడి చేస్తున్న ఈ గుంటనక్కలు, తోడేళ్లన్ని తోక ముడుచుకోవాల్సిందే అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.. బీఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారంలోకి రావడంపై ధీమా వ్యక్తం చేశారు. BRS అభ్యర్థులను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :