Saturday, 18 May 2024 10:08:34 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఏయే ప్రాంతాల్లో, ఏ సమయంలో..

Date : 14 November 2023 12:45 PM Views : 81

జై భీమ్ టీవీ - తెలంగాణ / : దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. దేశంలోని పలు ప్రధాన పట్టణాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పండగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదిలా ఉంటే దీపావళి వేడుకలు ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో జరిగే సదర్‌ వేడుకలకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీపావళి తర్వాతి రోజు జరిగే ఈ వేడుకల్లో యాదవులు పెద్ద ఎత్తున హాజరై సంబురంగా జరుపుకుంటారు. దున్నపోతులను ఆడిస్తూ సందడి చేస్తారు. ఈ వేడుకలను చూడడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా హాజరవుతుంటారు. సదర్‌ ఉత్సవాల్లో దున్నపోతులను ముస్తాబు చేసి, విన్యాసాలు చేస్తుంటారు. ఇందుకోసం హరియాణా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన దున్నపోతుల్ని నగరానికి తీసుకువస్తారు. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా సదర్‌ వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం సదర్‌ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈరోజు (మంగళవారం) ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. నగరంలోని పలు మార్గాల్లో వాహనాలను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం తెల్ల వారుజామున 3 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రయాణికులు, వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి తమకు సహకరించాలని తెలిపారు. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. * కాచిగూడ ఎక్స్‌ రోడ్‌ నుంచి వైఎంసియే రూట్‌లో వచ్చే వాహనాలు టూరిస్ట్ హోటల్‌ రోడ్‌ వైపు మళ్లించనున్నారు. * ఇక విఠల్‌ వాడి క్రాస్‌ రోడ్స్‌ నుంచి వచ్చే వాహనాలను.. భవాన్స్ న్యూ సైన్స్ కాలేజీ, కింగ్ కోటి మీదుగా మళ్లించనున్నారు. * ఇదిలా ఉంటే స్ట్రీట్ నంబర్ 8 నుంచి వైయంసియే వైపు వెహికిల్స్‌ను అనుమతించరు. ఆ దారిలో వచ్చే వాహనాలను రెడ్డి కాలేజ్ బహదూర్ పుర వైపు పంపిస్తారు. * ఇక ఓల్డ్ బర్కథ్ పుర పోస్ట్ ఆఫీస్ నుంచి వైయంసియే వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను క్రౌన్ కేఫ్, బాగ్ లింగంపల్లి వైపు మళ్లిస్తారు. అలాగే ఓల్డ్ ఎక్సైజ్ ఆఫీస్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను విఠల్ వాడి వైపు మళ్లిస్తారు. * బర్కత్ పుర చమాన్ నుంచి వైయంసియే వైపునకు వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గంలో వచ్చే వాహనాలు.. బర్కత్ పుర క్రాస్ రోడ్స్, టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు. * ఇక బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ నుంచి రెడ్డి కాలేజ్ వైపు వచ్చే వాహనాలు అనుమతించరు. ఈ దారిలో వచ్చే వాహనాలను నారాయణగూడ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. * సికింద్రబాద్ నుంచి కింగ్ కోటి వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను నారాయణగూడ క్రాస్ రోడ్స్, బార్కత్ పుర, బాగ్ లింగంపల్లి, వియస్టి, మీదుగా మళ్లించనున్నారు. * సదర్‌ వేడుకకు హాజరయ్యే వారి వాహనాలను శాంతి థియేటర్, రెడ్డి కాలేజ్, మెల్కొట్ పార్క్, దీపక్ థియేటర్ వద్ద పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :