Saturday, 18 May 2024 10:36:24 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఇంట్లో గంజాయి మొక్కల పెంపకం..పోలీసుల అదుపులో నిందితుడు

Date : 23 May 2023 12:56 AM Views : 154

జై భీమ్ టీవీ - తెలంగాణ / : మత్తుకు బానిసైన వ్యక్తి ఇంటి ఆవరణలోనే సెటప్ చేశాడు. పూల మొక్కల తరహాలో గంజాయి మొక్కలను పెంచేశాడు. మొక్కలు ఏపుగా పెరగడంతో ఆ వీధిలో అదోరకమైన వాసన గుప్పుమంది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక అంతే అయ్యగారి బండారం బయటపడింది. ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, వనస్థలిపురం పోలీసులు అకస్మాత్తుగా అతడి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. పూల మొక్కల మధ్యలో ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను గుర్తించారు. 10 మొక్కలను పెకలించి.. స్వాధీనం చేసుకున్నారు. అతడి ఇంట్లో దాచిన 300 గ్రాముల గంజాయి విత్తనాలను కూడా సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు యువకుడు గంజాయికి బానిసైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు మత్తు పదార్ధాలు మాయలో ముంచేస్తాయనడానికి ఇది నిలువెత్తు సాక్ష్యం. సిగరెట్ కు అలవాటైన వారు బడ్డీ కోట్లవైపు.. మందుకు బానిసైన వారు వైన్ షాపుల వైపు చూస్తుంటారు. ఇక ఇప్పుడు హైటెక్ యుగంలో గంజాయి చాప కింద నీరులా మారి పెనుముప్పుగా తయారైంది. ఇది ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికేస్తుంది. ఇది ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుందని గంజాయి ప్రియులు చెబుతుంటారు. చాలామంది యూత్‌.. గంజాయి వైపు అడిక్ట్ అయ్యారు. సీరియస్‌గా తీసుకున్న సర్కార్ గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టింది. పోలీసులు విసృత తనిఖీలు చేస్తున్నారు. కొంచెం అనుమానం ఉన్నా మెరుపు దాడులు చేస్తున్నారు. దీంతో ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకున్నాడో ఏమో ఓ యువకుడు వనస్థలిపురం పరిధిలోని గాంధీనగర్‌లో గల తన ఇంట్లోనే పెరట్లో గంజాయి మొక్కల పెంపకం షురూ చేశాడు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :