Saturday, 18 May 2024 10:08:43 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నాలుగోసారి ఆ ఇద్దరి మధ్యే పోటీ..! సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన అభ్యర్థులు

Date : 17 October 2023 06:22 PM Views : 71

జై భీమ్ టీవీ - తెలంగాణ / : మంథని చరిత్రలో ఆ ఇద్దరు ప్రత్యర్థులు మరో రికార్డును అధిగమించారు. ఒకే గూటి పక్షులుగా ఎదిగిన ఆ ఇద్దరు నాయకులు సుదీర్ఘ కాలం పాటు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరిద్దరే ప్రధాన పార్టీల అభ్యర్థులు కావడం విశేషం. రాష్ట్రంలోనే అత్యున్నత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో మంథని ఒకటి. స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సాయుధ పోరుకు శ్రీకారం చుట్టిన గుల్కొట శ్రీరాములును తొలిసారి అసెంబ్లీకి పంపించారు మంథని ఓటర్లు. ఆ తరువాత స్థానికేతరుడే అయినా స్వాతంత్ర్య పోరాటంతో ఉన్న అనుబంధంతో మంథని రాజకీయాల్లోకి తెరంగ్రేట్రం చేసిన పివి నరసింహరావును 1957 నుండి 1972 వరసగా నాలుగు సార్లు గెలిపించి చరిత్ర సృష్టించారు ఇక్కడి ప్రజలు. ఆ తరువాత చంద్రుపట్ల నారాయణ రెడ్డి రెడ్డి కాంగ్రెస్ నుండి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించగా, 1983 నుండి 1989 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీపాదరావు గెలిచి హ్యట్రిక్ కొట్టారు. ఇక 1994లో తెలుగు దేశం పార్టీ తరుఫున బరిలోకి దిగిన చంద్రుపట్ల రాంరెడ్డి విజయం సాధించగా.. 1999 నుండి 2009 వరకు వరసగా మూడు సార్లు మాజీ స్పీకర్ శ్రీపాదరావు తనయుడు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గెలుస్తూ వస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ గెలవగా, 2018 ఎన్నికల్లో శ్రీధర్ బాబు విజయం సాధించారు. నాలుగు సార్లు ప్రత్యర్థులుగా.. అయితే మంథని చరిత్రలో అరుదైన రికార్డును ప్రస్తుత ప్రధాన పార్టీల అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. నాలుగు సార్లు వీరిద్దరే అభ్యర్థులుగా మంథని బరిలో నిలిచారు. 2009 నుండి మంథని నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, భారతీయ రాష్ట్ర సమితి తరుఫున పుట్ట మధులు పోటీ పడుతున్నారు. నాలుగు సార్లు కూడా వీరిద్దరి మధ్య పోటీ నెలకొనడంతో సుదీర్ఘ కాలం ఇద్దరి అభ్యర్థుల మధ్యే పోరు నెలకొన్న చరిత్ర మంథనిలో చోటు చేసుకుంది. 2009లో పుట్ట మధు పీఆర్పీ తరుపున పోటీ చేయగా.. 2014 నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీధర్ బాబుతో తలపడ్డారు. 2014లో శ్రీధర్ బాబును ఓడించిన పుట్ట మధు.. 2018 ఎన్నికల్లో గెలుపును అందుకోలేకపోయారు. తాజాగా మరోసారి ఈ ఎన్నికల్లోనూ శ్రీధర్ బాబుపై పోటీ చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ఇద్దరు అభ్యర్థుల మధ్యే పోటీ నెలకనడం మంథని చరిత్రలో అరుదైన సంఘటనేనని చెప్పవచ్చు. డబుల్ హ్యాట్రిక్ శ్రీధర్ బాబు అయితే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకు అన్ని అనుకూలిస్తే.. మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే మంథని నుండి ఆరు సార్లు పోటీ చేసిన క్రెడిట్ ఆయన ఖాతాలోనే చేరింది. 1999లో ఆయన తండ్రి శ్రీపాదరావు హత్య తరువాత రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు 1999 నుండి ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారు. ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీధర్ బాబు డబుల్ హ్యాట్రిక్ కొట్టారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :