Saturday, 18 May 2024 10:08:38 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సర్టిఫికెట్లు మిస్‌ చేసిన పోస్టాఫీస్‌ సిబ్బంది.. అమెరికా వెళ్లే చాన్స్‌ కోల్పోయానని యువకుడు ఆవేదన

Date : 18 November 2023 08:03 AM Views : 81

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఒకోక్కసారి చిన్న చిన్న నిర్ణయాలు, కొంచెం నిర్లక్ష్యం కూడా కొందరు భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. తాజాగా పోస్టాఫీసు సిబ్బంది నిర్వాకంతో ఓ యువకుడి భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. వాళ్లు సర్టిఫికెట్లను మిస్‌ చేయడంతో అమెరికా వెళ్లే చాన్స్‌ కోల్పోయానని ఆ యువకుడు ఆవేదన చెందుతున్నాడు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం పోస్ట్ ఆఫీస్ అధికారుల నిర్లక్ష్యానికి లండన్‌లో చదువుకున్న ఖమ్మం విద్యార్థి సాయి రాహుల్‌ జీవితం.. ఒక్కసారిగా తల్లకిందులై పోయింది. పోస్టాఫీస్‌ సిబ్బంది నిర్వాకంతో సాయి రాహుల్ సర్టిఫికేట్ లు మిస్ అయ్యాయి. నగరానికి చెందిన సాయి రాహుల్ లండన్ లోని ఓ యూనివర్సిటీ లో మాస్టర్స్ పరీక్షలు రాసి ఖమ్మం వచ్చాడు. అతడికి వీలు కుదరక ఆగస్టులో సర్టిఫికెట్స్ అందించే కార్యక్రమానికి వెళ్లలేదు. దీంతో సర్టిఫికెట్స్ ఇతర ధ్రువపత్రాలు అక్కడి యూనివర్సిటీ వాళ్లు పోస్ట్ ద్వారా ఖమ్మంలోని సాయి అడ్రస్‌కు పంపించారు. కవర్ ఖమ్మం కలెక్టరేట్‌లోని పోస్ట్ ఆఫీస్‌కు చేరినట్టు ట్రాకింగ్ చూపిస్తున్నప్పటికీ తమకు రాలేదని సిబ్బంది చెబుతున్నారనంటూ సాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా.. పోస్టల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పుడు తన భవిష్యత్తు ఏంటని అతడు వాపోతున్నాడు. ఆ సర్టిఫికెట్స్ ఆధారంగా వచ్చే నెల అమెరికా వెళ్లాల్సి ఉందని.. పోస్టల్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో తన భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందంటూ ఆవేదన చెందుతున్నాడు సాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :