Saturday, 18 May 2024 10:08:41 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మీది ఫెయిల్యూర్ మోడల్.. మాది 24 గంటల.. పవర్ – ఫుల్ మోడల్ః కేటీఆర్

Date : 11 November 2023 03:34 PM Views : 64

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు అన్ని పార్టీలు ఓట్ల వేటలో పడ్డాయి. వివిధ వర్గాలను ఆకర్శించేందుకు రాజకీయ పార్టీలు రకరకాల హామీలు ఇస్తున్నాయి. ఓటర్లను ఆకర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లతో ముందుకొస్తోంది. ఆ పార్టీ ప్రకటించిన ముస్లిం, బీసీ డిక్లరేషన్ కుట్రపూరితమని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రతి సభలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్య ఉచిత కరెంట్, గ్యారంటీలు, డిక్లరేషన్ పైనే ప్రచారం జోరుగా నడుస్తుంది. కర్నాటకలో అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మొన్న మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నిన్న కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష రూపాయలు కేటాయిస్తామంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామన్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పై బీఆర్‌ఎస్ తీవ్రంగా స్పందించింది. బీసీ డిక్లరేషన్ ఓ కుట్ర పూరిత చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. ఇది బీసీలకు, మైనార్టీలకు మధ్య గొడవలు పెట్టేదని.. దీని వల్ల బీసీలు, మైనార్టీలు ఇద్దరూ నష్టపోతారని చెప్పారు. ముస్లింలను కలుపుకొని బీసీ కుల గణన చేసి రిజర్వేషన్లు కేటాయిస్తే రాజ్యాంగ పరంగా మైనార్టీలకు రావాల్సిన రిజర్వేషన్లు కోల్పోతారని అన్నారు. అలాగే ముస్లింలను బీసీల్లో కలపడం వల్ల బీసీలు కూడా నష్టపోతారని చెప్పారు కేటీఆర్. అటు బీసీలకు, ఇటు మైనార్టీలకు నష్టం చేకూర్చే విధంగా ఉన్న కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్. మరోవైపు బీజేపీని సైతం వదిలి పెట్టలేదు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ లు ఎన్నికల సమయంలో బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్నాయని, ఇన్నేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీలు బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు కేటీఆర్. 12 శాతం రిజర్వేషన్ పెంచుతామంటున్న కాంగ్రెస్ ఆ విషయాన్ని రాహుల్ గాంధీ చేత చెప్పించాలన్నారు. బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు కేటీఆర్.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :