Saturday, 18 May 2024 11:19:45 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

వరుస సభలు, సమావేశాలతో BRS ప్రచార హోరు.. ఇవాళ జడ్చర్ల, మేడ్చల్‌లో CM KCR బహిరంగసభలు

Date : 18 October 2023 10:49 AM Views : 68

జై భీమ్ టీవీ - తెలంగాణ / : వరుస సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సీఎం కేసీఆర్. నిన్న సిరిసిల్ల, సిద్ధిపేటలో పర్యటించిన గులాబీ బాస్.. ఇవాళ జడ్చర్ల, మేడ్చల్‌లో పర్యటించబోతున్నారు. సభ ఎక్కడైనా.. కాంగ్రెస్సే టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు సీఎం కేసీఆర్. హుస్నాబాద్ సభతో సమరశంఖాన్ని పూరించిన సీఎం కేసీఆర్.. సుడిగాలి పర్యటనలతో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. రోజూ కనీసం రెండు చోట్లు బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూల్‌లో భాగంగా ఇవాళ జడ్చర్ల, మేడ్చల్‌ బహిరంగ సభల్లో పాల్గొని కార్యకర్తలకు జోష్ నింపబోతున్నారు. గుండ్లపోచంపల్లి సమీపంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి 70 వేల పైచిలుకు జనసమీకరణ చేసేలా మంత్రి మల్లారెడ్డి ప్రణాళిక చేశారు. ఇక జడ్చర్లలోనూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. కుమారుడు పోటీ చేస్తున్న సిరిసిల్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లకు ఎమ్మెల్యేగా కేటీఆర్‌ ఉండటం ఈ ప్రాంత వాసుల అదృష్టమని అన్నారు. సిరిసిల్లలోని చేనేత కార్మికుల బతుకులు మార్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. తిరిగి అధికారంలోకి వస్తే సిరిసిల్ల వాసులు కోరుకుంటున్నట్టుగా సిరిసిల్లను మరో సోలాపూర్‌గా మార్చుతామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. నేత కార్మికుల బతుకులు బాగుచేసేందుకు బతుకమ్మ చీరలు తెచ్చామని సీఎం కేసీఆర్‌ అన్నారు. వాటిని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. సిరిసిల్ల నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేట వచ్చిన సీఎం కేసీఆర్‌ అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. తనను నాయకుడిని చేసిన సిద్దిపేట రుణం తీర్చుకోలేనిదని సీఎం అన్నారు. తన సన్నిహితులను పేరు పేరునా గుర్తు చేసుకున్నారు. ఆరడుగుల బుల్లెట్‌ అంటూ హరీష్‌రావును కొనియాడారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :