Saturday, 18 May 2024 10:51:49 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కొత్త సెక్రటేరియట్ కు కొత్త భద్రతను అప్పగించిన సర్కార్

Date : 23 April 2023 01:22 AM Views : 129

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సెక్రటేరియట్ భద్రతను టీఎస్ఎస్పీ(TSSP)కి అప్పగిస్తూ ఊత్తర్వులు జారీ చేసింది. గత 25 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రముఖుల భద్రత, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, కొత్త సెక్రటేరియట్ భద్రతను చూస్తున్న ఎస్పీఎఫ్ (SPF) ను పక్కకు పెట్టింది సర్కార్. దీనికి ఎలాంటి కారణాలను తెలపలేదు ప్రభుత్వం. ఎస్ పీఎఫ్ కు బదులుగా సెక్రటేరియట్, ప్రభుత్వ ఆస్తుల భద్రతను టీఎస్ఎస్ పీకి అప్పజెప్పింది. బందోబస్తు, వీఐపీ సెక్యూరిటీ, కూంబింగ్ లలో టీఎస్ ఎస్పీ సేవలు అందించనుంది. టీఎస్ఎస్ పీ కి ఫుల్ టైమ్ వెపన్ ట్రైనింగ్ ఇచ్చింది సర్కార్. 1998లో స్పెషల్ జీఓతో సెక్రటేరియట్ లో ఎస్పీఎఫ్ ప్రొటక్షన్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 1650 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది ఉండేవారు. గతంలో సెక్రటేరియట్ లో 150 మంది ఎస్ పీఎఫ్ సిబ్బంది సేవలు అందించారు. ప్రధాన ఆలయాలు, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఎస్పీ ఎఫ్ బందోబస్తు నిర్వహించే వారు. వాహనాల తనిఖీ, అబ్జర్వేషన్, వ్యక్తులపై మానిటరింగ్ టెక్నిక్స్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం 1991 లో SPF ఏర్పాటు చేశారు. 25 సంవత్సరాలుగా సెక్రటేరియట్ లో ఎస్పీ ఎఫ్ సెక్రటేరియట్ లో సేవలందిస్తోంది. ప్రస్తుతం ఎస్పీ ఎఫ్ డీజీగా ఉమేష్ షరాఫ్ ఉన్నారు. అయితే 25 ఏళ్లుగా ఉన్న ఎస్పీఎఫ్ కు బదులు టీఎస్ఎస్ పీ కు సెక్రటేరియట్ భద్రతను అప్పగించడమేంటని చర్చనీయాంశంగా మారింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :