Saturday, 18 May 2024 01:00:05 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

వాహన మరమత్తులలో జాప్యాన్ని నివారించండి - నగర మేయర్ గుండు సుధారాణి

ఇంజనీరింగ్ అధికారులతో వాహన మరమ్మతులపై సమీక్ష -- వెహికల్ షెడ్ ను తనిఖీ చేసిన మేయర్

Date : 21 April 2023 11:46 AM Views : 140

జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ జై భీమ్ ప్రతినిధి : వాహన మరమ్మత్తులలో జాప్యాన్ని నివారించాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లలో వాహన మరమ్మత్తులు వాటి స్థితిగతులపై ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సమీక్ష నిర్వహించి సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వాహన స్థితి గతులపై ఈఈ వివరణ ఇస్తూ ప్రస్తుతం మన వద్ద ఉన్న వాహనాలలో 03 హెచ్ఎంటి ట్రాక్టర్లు పూర్తిస్థాయిలో రిపేరింగ్ లో ఉన్నాయని మరో 05 ట్రాక్టర్లు కండెం (విచ్ఛిన్న) దశకు చేరుకున్నాయని, 02 కంప్రెసర్ లు, 07 డంపర్ ప్లేసర్లు, 04 టిప్పర్లు, 04 జెసిబి లు, 01 డోజర్, 03 స్వచ్చ ఆటో లు 02 రోబో లు,3 స్వ్వీపింగ్ మిషన్ లు రిపేరింగ్ దశలో ఉన్నాయని, 01 డోజర్ కండెం దశలో ఉందని, హిటాచీలను సర్వీసింగ్ కి పంపాల్సిన ఆవశ్యకత ఉందని, హిటాచి వాహనాన్ని ఇరాడికల్ సర్వీసెస్ ప్రాసెస్ లో భాగంగా చైన్ మార్చాల్సిన అవసరం ఉందని ఇందుకోసం రోబో ల మరమ్మత్తులకు సర్వీస్ నిర్వహించే వ్యవస్థ నగరం లో లేదని, జీ. డబ్యు.ఎం.సి లో వివిధ రకాల మొత్తం వాహనాలు 552 ఉన్నాయని, మిగితా వాహనాలు యదావిధిగా గా పనిచేస్తున్నాయని తెలుపగా మేయర్ నగర అవసరాల దృష్ట్యా కొత్త టాక్టర్లు, మొబైల్ టాయిలెట్స్ కొనడానికి గల అవకాశాలను పరిశీలించాలని, సూపరిండెంట్ ఇంజనీర్ వాహన షెడ్డును క్షేత్రస్థాయిలో తనిఖీ జరపాలని ఈ సందర్భంగా మేయర్ అన్నారు. అంతకుముందు హన్మకొండ లోని బాలసముద్రంలోని బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెహికల్ షెడ్డు ను మేయర్ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి కొనసాగుతున్న వాహన మరమ్మత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వాహన మరమ్మతులలో జాప్యం వల్ల నగరంలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయే అవకాశం ఉన్నందున, రిపేర్ కోసం షెడ్డు కు వచ్చే వాహనాలను ఎప్పటికప్పుడు రిపేర్ చేసి పంపించాలని అన్నారు. ఈ సందర్భంగా మరమ్మత్తుల కోసం వచ్చిన వాహనాల నమోదు రిజిష్టర్ ను మేయర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ.కృష్ణారావు డిసిలు శ్రీనివాస రెడ్డి, జోనా, ఈఈ సంజయ్ కుమార్, ఏ ఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :