Saturday, 18 May 2024 10:28:14 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రాజ్‌గోపాల్‌ అన్న తొందరపడకు, మాట జారకు.. ఎమ్మెల్సీ కవిత కౌంటర్..

రాజ్‌గోపాల్‌ అన్న తొందరపడకు, మాట జారకు.. ఎమ్మెల్సీ కవిత కౌంటర్..

Date : 21 December 2022 12:24 PM Views : 183

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈడీ దాఖలు చేసిన కొత్త చార్జ్‌షీట్‌లోనూ ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. Delhi Liquor Scam Case: రాజ్‌గోపాల్‌ అన్న తొందరపడకు, మాట జారకు.. ఎమ్మెల్సీ కవిత కౌంటర్..Mlc Kavitha ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈడీ దాఖలు చేసిన కొత్త చార్జ్‌షీట్‌లోనూ ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ తరుణంలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, కవిత మధ్య ట్విట్‌వార్‌ మొదలైంది. లిక్కర్‌ క్వీన్‌ అంటూ రాజగోపాల్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఛార్జ్‌షీట్‌లో 28 సార్లు కవిత పేరు ఉందని రాజగోపాల్ రెడ్డి ట్వీట్‌ చేశారు. కాగా, రాజ్‌గోపాల్‌రెడ్డి ట్వీట్‌కి ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. రాజ్‌గోపాల్‌ అన్న తొందరపడకు, మాట జారకు.. అంటూ సూచించారు. 28 సార్లు లేదా 28 వేల సార్లు చెప్పించినా…అబద్ధం నిజం కాదంటూ కవిత ట్వీట్‌ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో చార్జ్‌షిట్ లో కవిత పేరు రావడంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సైతం ట్విట్ చేశారు. ఇవ్వాల్సిన వివరణలు చాలా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. దీనిపై కూడా కవితా స్పందించారు. ‘‘నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమైనవి.. అబద్ధం.. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుంది. బీజేపీ రైతు వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల విధానాలను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో మళ్లీ కవిత పేరు చేర్చడంపై గులాబీ శిబిరం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కాగా.. మళ్లీ పేరు చేర్చడంపై ఎమ్మెల్సీ కవిత న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం. రెండో చార్జ్‌షీట్‌లో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన కొత్త చార్జ్‌షీట్‌లోనూ ఎమ్మెల్సీ కవిత తో పాటు, ఏపీ మాగుంట పేర్లు చేర్చింది. సమీర్‌ కంపెనీలో కవితకు 32శాతం వాటా ఉన్నట్లు అభియోగం మోపింది. సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్‌లో ఎమ్మెల్సీ కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మూత్తం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ రావు పేర్లు ఉన్నాయి. ఒబారాయ్ హోటల్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు ఈడీ విచారణలో పేర్కొన్నారు సమీర్ మహేంద్రు. శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్, బుచ్చిబాబు ఢిల్లీ ఒబారాయ్ హోటల్ సమీర్ మహేంద్రు కలిసినట్టు ఈడీ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. అనంతరం నలుగురు కలిసి శరత్ చంద్రా రెడ్డికి సంబంధించిన ప్రత్యేక విమానం(చార్టెడ్ ఫ్లైట్)లో హైదరాబాద్ వెళ్లినట్టు ఈడీ చార్జ్‌ షీట్‌లో పేర్కొంది. అలాగే, ఇండో స్పీరిట్స్‌లో ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవిత కు వాటా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్ కి రూ. 192.8 కోట్లు లాభం వచ్చిందని, ఇదంతా నేరపూరితమైన మార్గంలో వచ్చినట్టు పేర్కొంది ఈడీ. ఇక శరత్ చంద్రారెడ్డి చేతుల్లో ఐదు రిటైల్ జోన్లను అభిషేక్ రావు నడిపిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. కాగా, కవిత వాడి ధ్వంసం చేసిన పది ఫోన్ల వివరాలను ఈడీ సమీర్ మహేంద్రు చార్జ్‌షీట్‌లో వివరించింది.

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :