Saturday, 18 May 2024 01:11:15 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

న్యూ ఇయర్​ సందర్భంగా డ్రగ్స్​ ముఠాల

న్యూ ఇయర్​ సందర్భంగా డ్రగ్స్​ ముఠాల

Date : 20 December 2022 03:23 PM Views : 176

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు. ఒక కేసులో నేరెడ్​ మేట్​​ పోలీసులతో కలసి ఎల్బీనగర్ SOT పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. నిందితులను శీలం సాయి కృష్ణ (29), నైజీరియాకు చెందిన చిజియోక్ ఉచేచుకు అలియాస్ ఫీటర్ గా గుర్తించారు. ఒకొరో అనే మరో నైజీరియన్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి రూ.6 లక్షల విలువ జేసే 30 గ్రాముల మేధంపేటమీన్,1500 నగదు, 2 మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. కంప్యూటర్ వర్క్ చేయడానికి 2014లో ఇండియాకు స్టూడెంట్ వీసాపై వచ్చిన ఫీటర్, డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఫీటర్ కు గతంలో కూడా నేర చరిత్ర ఉందన్నారు. 2017లో పుణె డ్రగ్స్ కేసులో ఒక ఏడాది పాటు జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. శీలం సాయి కృష్ణ, ఫీటర్ కలిసి ముంబై నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మరోకేసులో.. రాజస్థాన్ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 35 లక్షలు విలువ చేసే 45 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 5 కోట్లకుపైగానే ఉంటుందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ కేసులో రాజస్థాన్ కు చెందిన ప్రవీణ్ కుమార్ ను ప్రధాన నిందితుడిగా గుర్తిచారు. నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిగేలా చూస్తామని సీపీ మహేష్ భగవత్ అన్నారు.

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :