Saturday, 18 May 2024 01:11:24 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Health ATM: ఎనీ టైం క్లినిక్ ఆవిష్కరణ.. ఈ మెషిన్ ద్వారా జ్వరం నుంచి క్యాన్సర్ వరకూ అన్ని రకాల టెస్టులు

Date : 07 October 2023 02:37 PM Views : 80

జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్ కు చెందిన జెమ్ ఓపెన్ క్కుబ్ టెక్నాలజీస్ సంస్థ ఎనీ టైం క్లినిక్ ని తయారు చేసింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఎనీ టైం క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ప్రణామ్ హాస్పిటల్స్ కలిసి ఈ మెషిన్ ను పబ్లిక్ కు అందుబాటులోకి తెచ్చారు. తొలిసారిగా ఈ మెషిన్ చందానగర్ లోని ప్రణామ్ హాస్పిటల్ లో ప్రారంభించారు. బేసిక్‌ హెల్త్‌ చెకప్‌, కంటి పరీక్షలు వంటి సుమారు డెబ్భై ఐదు రకాల పరీక్షలను ఈ మెషిన్ ద్వారా చేసుకోవచ్చు. Health ATM: ఎనీ టైం క్లినిక్ ఆవిష్కరణ.. ఈ మెషిన్ ద్వారా జ్వరం నుంచి క్యాన్సర్ వరకూ అన్ని రకాల టెస్టులు బ్యాంక్ ఏటీఎమ్స్ చూశాం.. వాటర్ ఏటీఎమ్స్ చూశాం.. తాజాగా గోల్డ్ ఏటీఎమ్స్.. టీ అండ్ కాఫీ ఏటీఎమ్స్ కూడా చూశాం కానీ మెడికల్ ఏటీఎం ఎప్పుడైనా చూశారా.? ఏంటి మెడికల్ ఏటీఎం అనుకుంటున్నారా.? అవును మీరు విన్నది నిజమే ఎనీ టైం క్లినిక్ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చాయి. హాస్పిటల్ కి వెళ్లాలంటే ఓ పెద్ద టాస్క్.. డాక్టర్ ని కన్సల్ట్ అయ్యే వరకు అయితే కాస్త స్పీడ్ గానే పనయిపోతుంది.. ఆ తరువాతే డాక్టర్ ఏదైనా టెస్ట్స్ రాస్తేనే ఇంకా వెయిట్ చేయక తప్పదు. డయాగ్నస్టిక్స్ దగ్గర గంటల తరబడి క్యూ లో నిల్చుని.. తీరా టెస్ట్ అయిపోయిందనుకుంటే టెస్ట్ రిపోర్ట్ కోసం రేపు రండి… సాయంత్రం వరకు వెయిట్ చేయండి అంటారు. ఇందంతా ప్రాసెస్ అవ్వడానికి ఎంత తక్కువ అనుకున్న కనీసం 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి డాక్టర్ ని కలవాలి. కానీ ఇప్పుడీ పని లేకుండా.. టైం వేస్ట్ అవ్వకుండా.. క్షణాల్లోనే మన ఆరోగ్య సమస్యను తెలుసుకుని డాక్టర్ ని సంప్రదించి. చిటికెలో టెస్ట్స్ చేపించుకుని రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. హైదరాబాద్ కు చెందిన జెమ్ ఓపెన్ క్కుబ్ టెక్నాలజీస్ సంస్థ ఎనీ టైం క్లినిక్ ని తయారు చేసింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఎనీ టైం క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ప్రణామ్ హాస్పిటల్స్ కలిసి ఈ మెషిన్ ను పబ్లిక్ కు అందుబాటులోకి తెచ్చారు. తొలిసారిగా ఈ మెషిన్ చందానగర్ లోని ప్రణామ్ హాస్పిటల్ లో ప్రారంభించారు. బేసిక్‌ హెల్త్‌ చెకప్‌, కంటి పరీక్షలు, ఈఎన్‌టీ, చర్మం, నెయిల్‌ ఇమేజ్‌ కాప్చరింగ్‌, హెచ్‌ఐవీ, లంగ్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, ట్యూమర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌, హార్ట్‌ డిసీజ్‌, కొవిడ్‌, ఆల్కహాల్, ఐక్యూ టెస్టులను దీని ద్వారా చేసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ల తో పాటు ప్రెగ్నెన్సీ టెస్ట్, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి ర్యాపిడ్ టెస్ట్స్ కూడా చేసుకోవచ్చు. మొబైల్‌ నెంబర్‌, థంబ్‌ స్కానర్‌, హెల్త్‌కార్డు, ఆధార్‌ కార్డు ద్వారా తొలుత రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మెషిన్ ఇచ్చే వచ్చే సూచనల ఆధారంగా టెస్ట్స్ చేసుకోవాలి. టెస్ట్ రిపోర్ట్స్ తో పాటు వెంటనే వైద్యులతో వీడియో కాలింగ్‌, అక్కడికక్కడే ప్రిస్కిప్షన్‌ ప్రింటవుట్‌ తీసుకోవచ్చు. ఒకే ఒక్క అటెండర్‌ సహాయంతో యంత్రం ఇచ్చే సూచనల ఆధారంగా రోగులే తమ పరీక్షలు చేసుకోవచ్చు. మెషిన్ కు సెట్ చేసిన వెబ్ కెమెరా ద్వారా వీడియోకాల్‌లో ఉన్న వైద్యులు సమస్యను గుర్తించి ప్రిస్కిప్షన్‌ను అందిస్తారు. పరీక్షల రిపోర్టులు నేరుగా మొబైల్‌కు రావడంతోపాటు అక్కడే ప్రింట్‌ తీసుకోవచ్చు. దీంతోపాటు డిజిటల్‌ హెల్త్‌ రికార్డును పరిశీలించొచ్చు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :