Saturday, 18 May 2024 10:28:15 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్రు : హైకోర్టు

Date : 14 December 2022 04:51 PM Views : 182

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. షర్మిల ఇంటి ముందు బారికేడ్లను తొలగించాలని ఆదేశించింది. షర్మిల ఇంటిముందు పోలీసులు ఎందుకు మెహరించారని ప్రశ్నించింది. షర్మిల దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. షర్మిలను నిన్న కోర్టుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఇంట్లో నుండి బయటికి రానివ్వకుండా ప్రతి రోజూ పోలీసులు అడ్డుకుంటున్నారని.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా బయటకు రానివ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. షర్మిల వల్ల తరుచూ శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ వాదించారు. బెయిల్ షరతులను షర్మిల ఉల్లంఘించారని..ఎస్ఆర్ నగర్, అంబేద్కర్ విగ్రహం వద్ద ఘటనలను కోర్టుకు వివరించారు. తన కార్యక్రమాలపై పోలీసులకు ఆమె తప్పుడు సమాచారం ఇస్తోందని చెప్పారు. దీంతో రోడ్లపై ఎటువంటి కార్యక్రమాలు చేపట్టొద్దని.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బహిరంగ సభలు నిర్వహించొద్దని షర్మిలకు కోర్టు సూచించింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :