Saturday, 18 May 2024 11:19:44 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీలు.. అందరి దృష్టి ఆ జిల్లాపైనే

Date : 26 October 2023 10:20 AM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫకేషన్‌కు రోజులు సమీపస్తుండటంతో పొలిటికల్ పార్టీలు తమకు పట్టున్న ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నాయి. ఓటు బ్యాంక్ ఉన్న చోట్ల జాతీయ నాయకుల పర్యటనలు ఖరారు చేసే పనిలో రాష్ట్ర నాయకత్వం తలమునకలైంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన పార్టీల ఫోకస్ ఎక్కువైంది. ఉమ్మడి పాలమూరులో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి. జిల్లాలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి మంచి పట్టు ఉండడంతో పార్టీ నాయకత్వాలు దృష్టి సారించాయి. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో పార్టీలు అందుకు తగ్గట్లు ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ముఖ్య నాయకుల సభలకు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే కమలం పార్టీ ఒక అడుగు ముందుకేసి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించింది. రానున్న రోజుల్లో పార్టీ జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యంత్రులతో సమావేశాలు, ర్యాలీలకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ముఖ్యంగా కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్, గద్వాల్ మహబూబ్ నగర్ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే నేతల ప్రచారాల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని టాక్ నడుస్తోంది. ఇక కాంగ్రెస్ సైతం పాలమూరుపై గంపెడు ఆశలు పెట్టుకుంది. కీలక నేతలు జూపల్లి కృష్ణారావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, సరితా తిరుపతయ్య మరికొంత మంది పార్టీల చేరడంతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కొడంగల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, గద్వాల్, అలంపూర్, మహబూబ్ నగర్, మక్తల్, నారాయణపేట, వనపర్తి నియోజకవర్గాల్లో దృష్టి సారించింది కాంగ్రెస్. అందుకు తగ్గట్టుగానే గాంధీ కుటుంబసభ్యులతో ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ లో కీలక నేతలు చేరిన ప్రాంతాల్లో ప్రచారాన్ని బలంగా నిర్వహించే యోచనలో హస్తం నాయకత్వం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 31న కొల్లాపూర్ లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా పాలమూరు ప్రజాభేరి సభ నిర్వహించ తలపెట్టారు. అలాగే రెండో విడత బస్సు యాత్రలో ఉమ్మడి జిల్లాలో పలు నియోజకర్గాలను కవర్ చేసేలా ప్లాన్ చేశారు. అధికార పార్టీ సైతం మహబూబ్ నగర్ ప్రచార హోరుకు ముందే సిద్ధమయ్యింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ప్రారంభించడంతో ఒక రకంగా ముందే ఎన్నికల వేడి రాజేసింది బీఅర్ఎస్. గులాబీ బాస్ ఇప్పటికే జడ్చర్ల సభలో పాల్గొని కార్యకర్తలను సన్నద్ధం చేశారు. ఇవాళ అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాలలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో సైతం ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూడు పార్టీలు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచార పర్వానికి సన్నద్ధం అవుతున్నాయి. జాతీయ స్థాయి నేతలతో ప్రచారం ఆయా పార్టీలకు ఏ మేర కలిసి వస్తయో వేచి చూడాల్సిందే మరీ.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :