Saturday, 18 May 2024 11:19:39 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బీజేపీలో వేములవాడ టికెట్ వార్.. బీజేపీ అభ్యర్థుల మధ్య ఫైట్.. పార్టీ పెద్దలతో విద్యాసాగర్ రావు భేటీ

Date : 25 October 2023 09:39 PM Views : 79

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రెండో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ ఎన్నికల కోసం 52మందితో బీజేపీ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.. కానీ విడుదలైన మర్నాటి నుంచే అసంతృప్తులు మొదలయ్యాయి. అలకలు, కన్నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఎవరో కాదు.. బండి సంజయ్ కూడా లిస్ట్‌పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయనకు కరీంనగర్‌లో చోటు దక్కినా, తన అనుకున్నవాళ్లకు కొన్ని టికెట్లు కూడా ఇప్పించుకోలేక పోయినట్లు సంజయ్‌ ఆవేదనలో ఉన్నట్లు సమాచారం. ఇక మాజీ ఎంపీ వివేక్ అయితే టికెట్ల విషయంలో ఎక్కడా తనను పరిగణనలోకి తీసుకోలేదని చిన్నబుచ్చుకున్నట్లు తెలుస్తోంది. వేములవాడలో బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థుల మధ్య టికెట్ కోసం కోల్డ్ వార్ కొనసాగుతోంది. మాజీ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ మధ్య టికెట్ వార్ ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ ఆఫీసుకు చేరింది. తన కుమారుడికి వేములవాడ టికెట్ ఇవ్వాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాష్ జవదేకర్‌, సునీల్ బన్సల్‌‌ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కలిశారు. వేములవాడ సీటు పై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. వేములవాడ అసెంబ్లీ సీటును వికాస్ రావుకే ఇవ్వాలంటూ విద్యాసాగర్ రావు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు, తుల ఉమ కోసం ఈటెల రాజేందర్‌ పట్టుపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ కార్యాలయంలో వేములవాడ టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు తుల ఉమ. వేములవాడలో ఇప్పటికే తుల ఉమ ప్రచారం మొదలు పెట్టారు. బీజేపీ ఆశావహ అభ్యర్థిగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న తుల ఉమ ప్రచార కార్యక్రమానికి పోస్టర్లతో శ్రీకారం చుట్టారు. కేసీఆర్ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధించారు. వేములవాడలో పాగా వేసే క్రమంలో ‘సాలు దొర – సెలవు దొర’ అంటూ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు తుల ఉమ. వేములవాడ అభివృద్ధికి తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. దీంతో మొదటి జాబితాలో వేములవాడ టికెట్‌ను బీజేపీ ఖరారు చేయలేదు. ఇక వికాస్‌ రావు కు బండి సంజయ్ మద్దతు ఇస్తుంటే… తుల ఉమకు ఈటల మద్దతు ఇస్తున్నారు. మరోవైపు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా రంగం లోకి దిగారు. తనయుడు వికాస్‌కు టికెట్ కోసం ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ మాత్రం తుల ఉమకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రెండుమూడు రోజుల్లో రెండవ జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే ఈ పంచాయితీ తేలేలా ఉంది. అయితే ఈ టికెట్ పెండింగ్ పెట్టడంతో బండి సంజయ్ నారాజ్ అయినట్లు సమాచారం.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :