Saturday, 18 May 2024 11:37:53 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అంబేద్కర్ బాటలోనే మన ప్రయాణం : సీఎం కేసీఆర్

Date : 30 April 2023 04:19 PM Views : 129

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ ప‌రిపాల‌న‌కు గుండెకాయ‌గా, అత్యంత శోభాయ‌మానంగా నిర్మించిన స‌చివాల‌యం తన చేతుల మీదుగా ప్రారంభించ‌డం తన జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని వెల్లడించారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో నూతన నిర్మించిన సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. పెద్ద పోరాటం త‌ర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. స‌మైక్య పాల‌న‌లో తెలంగాణ‌లో చాలా విధ్వంసం జ‌రిగిందన్నారు. వ్యవసాయానికి నీళ్లు వచ్చేవి కాదన్నారు. ప్లానింగ్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియాలో కూడా హైద‌రాబాద్ మిన‌హా అన్ని జిల్లాల‌ను వెనుక‌బ‌డిన జిల్లాల్లో చేర్చారని అన్నారు. ఈ రోజు తెలంగాణ సాధించిన ప్రగ‌తిలో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని, అనేక విభాగాలు క‌లిసి ప‌ని చేయ‌డం వ‌ల్లే ప్రగ‌తి సాధ్యమైందని చెప్పారు. స‌మాన హ‌క్కుల కోసం ఉద్యమించాల‌ని, స‌మీక‌రించు, బోధించు పోరాడు అని సందేశం ఇచ్చిన మ‌హానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, వారి సందేశంతోనే గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ చూపిన మార్గంలోనే మ‌న ప్రయాణం కొన‌సాగుతుందన్నారు. ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అన్ని వ‌ర్గాల ప్రజ‌ల ముఖంలో చిరున‌వ్వులు రావాల‌న్న అంబేద్కర్ స్ఫూర్తిని అందుకుని 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నామన్నారు. అనునిత్యం అంబేద్కర్ స్ఫుర‌ణ‌కు రావాల‌నే ఉద్దేశంతో స‌చివాల‌యానికి ఆ మ‌హానీయుడి పేరు పెట్టుకున్నామని, ఆయ‌న అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తామ‌ని హామీ ఇస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మరోవైపు.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పున‌ర్నిర్మాణం కోసం అంకిత‌భావంతో అడుగేసే స‌మ‌యంలో తెలంగాణ భావాన్ని, నిర్మాణాన్ని కాంక్షను జీర్ణించుకోలేని కొంద‌రు పిచ్చివారు కారుకూత‌లు కూశారని వ్యాఖ్యానించారు. మొత్తం తెలంగాణ‌నే కూల‌గొట్టి క‌డుతారా..? అని చిల్లర వ్యాఖ్యలు చేశారని, అవేమీ ప‌ట్టించుకోకుండా పున‌ర్నిర్మాణం చేసుకున్నామన్నారు. ‘‘పున‌ర్నిర్మాణం అంటే వ‌చ్చిన నీటిని, కోల్పోయిన చెరువుల‌ను పునర్నిర్మాణం చేసుకున్నాం. జీవ‌న‌దులు, ఉప‌న‌దులు తెలంగాణ‌లో ఉన్నాయి. గోదావ‌రి న‌ది ఎప్పుడు దాటినా అక్కడ చిల్లర డ‌బ్బులు వేసి దండం పెట్టేవాడిని. మా పొలాలు ఎప్పుడు పండిస్తావ‌ని అడిగేవాడిని. తెలంగాణ ఇంజినీర్లు చేసిన అద్భుత‌మైన లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది పున‌ర్నిర్మాణం అంటే’’ అని వ్యాఖ్యానించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :