Saturday, 18 May 2024 11:37:55 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బండ్ల గణేశ్‌ పోటీ..? రేవంతన్న అంటూ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ సినీ నిర్మాత

Date : 08 October 2023 03:35 PM Views : 104

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలయ్యింది. రేపో, మాపో.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే.. అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ఓ అడుగు ముందుకేసి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.. అయితే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని రోజుల్లో రెండూ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తులను ప్రారంభించింది. అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ ఇవాళ భేటీ కానుంది. ఈ తరుణంలో చరిష్మా గల నేతలు ఎవరున్నారు..? ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్థిక, అంగబలం ఉన్న నేతలు ఎవరున్నారు..? అనే దానిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ తరుణంలో కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రయత్నం చేస్తున్నారని.. టికెట్ కోసం అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది.. గ్రేటర్‌లో బలమైన సామాజిక వర్గం, అన్ని అవకాశాలున్న నేతలకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో.. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేసిన కూకట్‌పల్లి సీటుకు బండ్ల గణేష్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ఆదివారం క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. కూకట్‌పల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారనే ప్రచారం నేపథ్యంలో బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేసి.. పోటీ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ‘‘ఈసారి జరిగే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాకు అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ, ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ముఖ్యం.. దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం.. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం’’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసి.. కూకట్‌పల్లి కాంగ్రెస్ టికెట్ పై క్లారిటీ ఇచ్చారు. ఇదిలాఉంటే.. ఈ రోజు జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దాదాపు 60 నుంచి 80 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు మూడు రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందన్న ఊహగానాలతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. లిస్టులో ఎవరి పేరు ఉంటుంది.. ? ఎవరి పేరు ఉండదు అనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :