Saturday, 18 May 2024 01:11:18 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే గుండె పోటుతో మృతి.. రాజకీయ నేతల సంతాపం

Date : 17 October 2023 10:58 AM Views : 76

జై భీమ్ టీవీ - తెలంగాణ / : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గుంజ సరస్వతి (52) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం (అక్టోబర్‌ 15) ఇంట్లో ఉన్న సమయంలో సత్యవతికి గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. సత్యవతి మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సత్యవతి మృతి పట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. 2009- 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెతో పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎప్పుడూ తపనపడేవారని, ఏ చిన్న అవకాశం వచ్చిన ప్రజా సంక్షేమం విషయంలో తన గొంతుకని బలంగా వినిపించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనితీరును సత్యవతి ఎప్పటి కప్పుడు వివరించేవారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇంతలో ఇలాంటి దిగ్భ్రాంతికరమైన వార్తను వినాల్సి వచ్చిందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూనన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ కూడా సత్యవత మృతిపట్ల సంతాపం తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆమె స్వగృహం వద్దకు వెళ్లి పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. కుంజా సత్యవతి బీజేపీలో చురుకుగా పని చేస్తున్న నేత అని, సత్యవతి మృతి చెందడం పార్టీకి తీరని లోటని బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులతో పాటు భద్రాచలంలోని ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు కూడా సత్యవతి మృతి ఆకస్మిక మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. భద్రాచలంలోని సత్యవతి స్వగృహంలో స్థానికులు, అభిమానుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచారు. కుంజా సత్యవతి భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్​పార్టీ తరపున పోటీ చేసి 2009 నుంచి 2014 వరకు శాసన సభ్యురాలుగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి పార్టీలో కీలక పాత్ర పోషించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :