Saturday, 18 May 2024 10:51:51 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఆత్మహత్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నా.. వాళ్లను నమ్మొద్దు.. సిరిసిల్ల సభలో సీఎం కేసీఆర్

Date : 17 October 2023 06:32 PM Views : 97

జై భీమ్ టీవీ - తెలంగాణ / : రైతుల కోసమే ధరణిని తీసుకువచ్చాం.. సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం.. మోసపూరిత మాటలు నమ్మొద్దు అంటూ భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. చేనేతల కోసమే బతుకమ్మ చీరలు తీసుకొచ్చామని.. కొందరు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఓట్ల అబద్దాలు చెప్పలేదని.. ఇచ్చిన హామీలను అమలు చేసి చూపుతున్నామని కేసీఆర్ పేర్కొ్నారు. మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీయే అధికారం చేపడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్లలో ఒకప్పుడు ఆత్మహత్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో సిరిసిల్లలో ఎన్నో సార్లు పర్యటించానని, సమైక్య పాలనలో నాశనం అయిపోయిందంటూ కేసీఆర్ పేర్కొన్నారు. అప్పర్ మానేరు ప్రాజెక్టుతో జలధార పరుగులు పెడుతున్నదంటూ పేర్కొన్నారు. నిండు కుండలా మారి మానేరు ప్రాజెక్టు సిరిసిల్లను సస్యాశ్యామలం చేసిందన్నారు. సిరిసిల్లలో ఎంతో అభివృద్ధి జరిగిందంటూ పేర్కొన్నిరు. సిరిసిల్లలో ఒకప్పుడు చేనేతల ఆత్మహత్యలు ఉండేవని.. చేనేతల అభివృద్ధి కోసం కేటీఆర్ ఎంతో చేశారంటూ అభినందించారు. 24 గంటల కరెంట్ విషయంపై మరోసారి కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ అంటూ చెప్పిందని.. మోసపూరిత హామీలను నమ్మొద్దంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఓట్ల కోసం మోసపూరిత హామీలతో వస్తారని.. కాంగ్రెస్ ను నమ్మవద్దంటూ సూచించారు. మరికొందరు మతాల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తారని జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. మరోసారి గులాబీ పార్టీని ఆశీర్వదించాలంటూ కేసీఆర్ కోరారు. Cardamom Benefits: డైలీ రెండు యాలుకలు తింటే అద్భుతమే.. అసలు మ్యాటర్ తెలిస్తే నోరెళ్లబెడతారంతే.. అంతకుముందు మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఇది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం అంటూ పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందంటూ ధీమా వ్యక్తంచేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :