Saturday, 18 May 2024 09:42:11 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

6 గ్యారంటీలు సరిపోవు.. హామీల డోస్ పెంచే పనిలో తెలంగాణ కాంగ్రెస్..!

Date : 07 October 2023 02:41 PM Views : 78

జై భీమ్ టీవీ - తెలంగాణ / : Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ తన ఆస్త్రాలుగా చెప్పుకుంటున్న ఆరు గ్యారంటీ స్కీమ్స్ పై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ ప్రజలు 6 కి ఫిక్స్ అయితే.. అధికారం ఫిక్స్ అయినట్టేనా? ఆరు పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం ఎంటి? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల స్కీమ్స్ తెలంగాణ ప్రజలు నమ్ముతారా? ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడం తెలంగాణలో సాధ్యం అవుతుందా? Telangana Elections: 6 గ్యారంటీలు సరిపోవు.. హామీల డోస్ పెంచే పనిలో తెలంగాణ కాంగ్రెస్..! Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ తన ఆస్త్రాలుగా చెప్పుకుంటున్న ఆరు గ్యారంటీ స్కీమ్స్ పై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ ప్రజలు 6 కి ఫిక్స్ అయితే.. అధికారం ఫిక్స్ అయినట్టేనా? ఆరు పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం ఎంటి? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల స్కీమ్స్ తెలంగాణ ప్రజలు నమ్ముతారా? ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడం తెలంగాణలో సాధ్యం అవుతుందా? తెలంగాణ కాంగ్రెస్‌లో తుక్కుగూడ సభతో కొత్త జోష్ వచ్చింది.. సభలో సోనియా, రాహుల్ గాంధీలు ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌తో జనాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతాయని చర్చ జరుగుతుంది. దీనిపై ఇటు బీజేపీ, బీఆరెస్ లు సైతం కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. కాని కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్‌లోనే గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌లో మహలక్ష్మి ద్వారా మహిళలకు ప్రతినెలా రూ. 2,500 పంపిణి, రూ. 500 కే వంట గ్యాస్ సిలిండర్.. అర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. రైతు భరోసా ద్వారా ప్రతిఏటా రైతులు, కౌలు రైతులకు రూ. 15,000 బ్యాంక్ అకౌంట్‌లోకి, వ్యవసాయ కూలీలకు రూ. 12,000 పంపీణి.. వరిపంటకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రకటించింది. గృహజ్యోతి స్కీమ్ ద్వార ప్రతి కటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని.. ఇల్లులేని వారికి ఇంటి స్థంలంతో కలిపి రూ. 5 లక్షలతో ఇంటి నిర్మాణం. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. యువ వికాసం స్కీమ్ ద్వార విద్యార్ధులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. చేయూత స్కీమ్ పథకం ద్వారా వృద్ధులకు, వికాలంగులకు, ఒంటరి మహిళలకు, రూ. 4,000 నెలవారీ పింఛను. రూ. 10 లక్షల రాజీవ్ అరోగ్యభీమా అందించాలని కాంగ్రెస్ పార్టీ తన ఆరు ఆస్త్రాలుగా చెప్పుకుంటుంది. అయితే వీటిని ఎక్కడి నుండి అమలు చేస్తారని బీఆరెస్ చెబుతున్న వాటికి.. కర్ణాటక, రాజస్థాన్, ఛత్తిస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు ఉదాహరణగా.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌లో 200 యూనిట్లలో ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్‌ని కర్ణాటక, రాజస్థాన్‌లో అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మహాలక్ష్మి ద్వారా రూ. 2,500, కర్ణాటకలో, వరికి క్వింటాల్‌కి రూ. 500 బోనస్ ఛత్తిస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అక్కడ తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే అన్ని గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నామని, తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఇక్కడ రైతుబంధు కొనసాగుతుంది దానిని మరో 5 వేలు పెంచాల్సి ఉంటుంది. తెలంగాణలో పెన్షన్ రూ. 3 వేలు ఇస్తున్నారు. దానిని మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవి ఇష్టారితిన ఇచ్చిన హామీలు కాదని దీనిపైన ఆర్థిక నిపుణులు అధ్యయనం చేసిన తరువాతనే వీటిని ప్రకటించిందని తెలంగాణ నేతలు చెబుతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :