Saturday, 18 May 2024 01:59:50 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నామినేషన్ దాఖలుకు ఏ రోజున ముహూర్తం బాగుంది..? పండితుల చుట్టూ నేతల ప్రదక్షిణలు..

Date : 12 October 2023 08:32 AM Views : 87

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. నామినేషన్లకు కూడా త్వరలో తెరలేవనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబర్‌ 3న నామినేషన్లకు నోటిఫికేషన్‌ వస్తుంది. నవంబర్‌ పదో తేదీ దాకా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అయితే, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు.. ఒక్క అధికారపార్టీ బీఆర్ఎస్ మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది.. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలోనే అభ్యర్థులకు బీ ఫాంలను అందించనున్నారు. విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ త్వరలోనే టికెట్లను ప్రకటించనుంది. మొత్తం మీద.. నామినేషన్ల దాఖలుకు దాదాపు నెల సమయం ఉంది. అయితే, ఇప్పటికే టికేట్ డిసైడ్ అయిన అభ్యర్థులు.. టికెట్ వస్తుందని ఊహగానాల్లో ఉన్న పలు పార్టీల ఆశావహులు.. ఏ రోజున నామినేషన్‌ వేయాలి, ఏ రోజు ముహూర్తం బాగుంది..? అనే విషయాలు తెలుసుకోవడానికి పండితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం.. అయితే, నామినేషన్లు వేయడానికి ఆ నాలుగు రోజులను మించి ముహుర్తం లేదట. దీంతో నేతలు ఆ నాలుగు రోజుల్లోనే నామినేషన్‌ వేయడానికి రెడీ అవుతున్నారుట. నామినేషన్లకు నవంబర్‌ 3, 4, 8, 9 తేదీలు బాగున్నాయని పండితులు చెబుతున్నారు. ఆ 4 రోజుల్లో తిథి, నక్షత్ర బలం అదుర్స్ అని చెబుతున్నారు. దీంతో ఆయా రోజుల్లో ఏ టైమ్‌కి నామినేషన్‌ వేయాలి అనే విషయంపై పండితులను సంప్రదిస్తున్నారు నేతలు. ఆ 4 రోజుల్లోనే మ్యాగ్జిమమ్‌ నామినేషన్లు దాఖలవుతాయని భావిస్తున్నారు. నవంబర్‌ 3.. ఉత్తర నక్షత్రంతో కూడిన శుక్రవారం ముహూర్త బలం బాగా ఉందిట. దీనికితోడు అది శుక్రవారం కావడంతో ముస్లిం అభ్యర్థులు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. వారు పవిత్రంగా భావించే శుక్రవారం కావటమే దీనికి కారణం. నవంబర్‌ 4న.. పుబ్బ నక్షత్రం ఉంటుంది. అది ధన బలం కూడా మెండుగా ఉండే రోజుగా పండితులు పేర్కొంటున్నారు. ఆ రోజు నామినేషన్‌ వేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారని చెబుతున్నారు. నవంబర్‌ 8న శ్రీరామచంద్రుల వారి నక్షత్రం అయిన పునర్వసు ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ముహూర్తం బానే ఉందంటున్నారు. నవంబర్‌ 9న విష్ణు తిథిగా పేర్కొనే ఏకాదశి వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆ రోజే నామినేషన్‌ దాఖలు చేయనున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇది నామినేషన్ల ఘట్టం ముగియటానికి సరిగ్గా ముందు రోజు కావటం విశేషం. అయితే, ముహూర్త బలం అభ్యర్థుల విజయావకాశాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నేతలందరూ వారి చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :