Saturday, 18 May 2024 11:37:58 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సీట్లు పోయిన అ సిట్టింగులు ఎక్కడ.. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు..

Date : 16 October 2023 09:42 AM Views : 83

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా కొద్దీ.. రాజకీయాల సమీకరణాలు మారుతున్నాయి. అందులోనూ అధికార బీఆర్ఎస్ పార్టీలో.. మరీ వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జనగామ జిల్లాలో రాజీ ఫార్ములాతో అసమ్మతి నేతలందరినీ ఒక్కతాటి మీదకు తీసుకువచ్చింది అధినాయకత్వం. ఛైర్మన్ పదవులతో అసంతృప్తులైన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య ఇద్దరినీ సీఎం కేసీఆర్ సంతృప్తిపరిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరున్న ఆ ఇద్దరు నేతలు గత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేసి 2014, 2018 ఎన్నికల్లో రెండు దఫాలుగా గెలిచిన రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలకు ఈసారి అవకాశం ఇవ్వలేదు. మూడోసారి అధికారమే లక్ష్యంగా కీలక అడుగులు వేస్తుంది బీఆర్ఎస్ అధిష్టానం. ఈ క్రమంలోనే కొన్ని సర్వేల ఆధారంగా వారిద్దరికీ అవకాశం దక్కలేదు. ఈ స్థానాల్లో ఇద్దరు ఎమ్మెల్సీలకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. అందుకే ఈసారి ఎమ్మెల్యే రాజయ్య, ముత్తిరెడ్డికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టి సంతృప్తి పరిచారు అధినేత కేసీఆర్. ఎన్నికలు నోటిఫికేషన్ రాక ముందే ఆ ఇద్దరు నేతలు కూడా పదవి బాధ్యతలు స్వీకరించారు. టికెట్ రాకపోవడంతో కొంత అసంతృప్తితో ఉన్నా.. ఇద్దరు నేతలు కొంత తగ్గినట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలో హ్యట్రిక్ కొట్టాలన్న సంకల్పంతో అందరి కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ తన గెలుపు గుర్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగానే దాదాపు సిట్టింగులకే మళ్లీ స్థానం కల్పించిన అధినేత.. కొన్ని స్థానాల్లో మాత్రం ఇతరులకు అవకాశం కల్పించారు. అందులో నాలుగు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అయితే.. ఆ పెండింగ్ పెట్టిన స్థానాల్లో జనగామ పంచాయితీ అంతా ఇంతా కాదు. టికెట్ నాకంటే నాకే అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏకంగా రోడ్డెక్కి యుద్ధం చేసినంత పని చేశారు. ఈ పంచాయితీని పరిష్కరించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ప్రయత్నించారు. చివరికి.. అధినేత కేసీఆరే స్వయంగా కల్పించుకుని జనగామ పంచాయితీని పరిష్కరించారు. దీంతో.. ముత్తిరెడ్డికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేసి.. జనగామ టికెట్ పల్లా రాజేశ్వర రెడ్డికి కన్‌ఫామ్ చేయడంతో పంచాయితికీ పుల్ స్టాప్ పెట్టేశారు కేసీఆర్. మరోవైపు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు సైతం ఇది పరిస్థితి. రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ కట్టబెట్టారు అధినేత కేసీఆర్. కాగా.. బీఫామ్ ఇచ్చేలోపే సమీకరణాలు మారతాయంటూ రాజయ్య ఆశాభావం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే.. ప్రగతి భవన్‌కు పిలిచి మరీ కేటీఆర్.. బుజ్జగింపు చర్యలు చేపట్టారు. చివరికి.. రాజయ్యకు కేబినెట్ హోదాతో సమానమైన నామినేటెడ్ పదవి ఇచ్చి.. సైలెంట్ చేసేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంతవరకు బాగానే ఉన్న ఈ ఇద్దరు నేతలు నియోజకవర్గంలో ఉంటే ఇబ్బంది అనే పార్టీ అధిష్టానం భావించింది. అందుకే ఈ ఇద్దర్నీ ప్రగతి భవన్ కు పిలిపించారు కేసిఆర్. గత వారం రోజులుగా ప్రగతి భవన్‌లోనే ఉంటున్నారు ఇద్దరు నేతలు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రగతి భవన్‌కే పరిమితం అవుతున్నారు. ప్రత్యేకంగా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. జిల్లాల నుంచి వచ్చే ప్రతి రిపోర్ట్ కేసీఆర్‌కు అందజేయాల్సిన బాధ్యత వీరిద్దరిది. అందుకనుగుణంగా సలహాలు,సూచనలు ఇస్తుండాలి. ఇలా వీరిని ప్రగతి భవన్‌లో తన దగ్గరే పెట్టుకున్నారు కేసిఆర్. వార్ రూమ్ లో ప్రతి రోజూ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. ఇలా కొంత మందికి ఇప్పటికే బాధ్యతలు అప్పగించి వీరిని ప్రతి క్షణం ఓ కంట కనిపెడుతున్నారు కేసిఆర్. ఎన్నికల వేళ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు బీఆర్ఎస్ అధినేత. అందుకే ఇలాంటి అసమ్మడి నేతలను తన పర్యవేక్షణలో ఉంచుకున్నారు కేసీఆర్.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :