జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులిచ్చింది. డ్రగ్స్ కేసులో భాగంగా ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీల పై రోహిత్ కు నోటీసులిచ్చినట్లుగా తెలుస్తోంది. వీరు ఈనెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ అయ్యాయి. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసు రాష్ట్రంలో కలకలం రేపింది. ఇందులో పలువురు సినీ తారల హస్తం ఇందులో ఉందనే వార్తలు కలకలం సృష్టించాయి. వారికి గతంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక మరోసారి ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఫామ్‌హౌస్ కేసులో ఇటీవలే రోహిత్‌రెడ్డి వాంగ్మూలం నమోదైంది. ఈ సమయంలోనే రోహిత్‌రెడ్డికి ఈడీ పిలుపుపై ఉత్కంఠ నెలకొంది. రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లోనే ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ జరిగింది. అలాగే గతంలో బెంగళూరు డ్రగ్స్‌కేసులో రోహిత్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి రోహిత్ వ్యాపార లావాదేవీలపై కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 2021లో బెంగళూరులోని గోవర్థనపుర పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కలహర్‌రెడ్డి అనే వ్యాపారవేత్తతో కలిసి బెంగళూరులో డ్రగ్స్ పార్టీకి రోహిత్‌రెడ్డి వెళ్లారని.. ఆ పార్టీ సినీనిర్మాత శంకర్‌గౌడ ఇచ్చారని సమాచారం. నైజీరియన్ల దగ్గరి నుంచి రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పార్టీకి చేరినట్టు తేల్చిన బెంగళూరు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకున్న మస్తాన్, శంకర్‌గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కేసులో భాగంగా హీరో తనీష్‌ను బెంగళూరు పోలీసులు విచారించారు.
Admin