Saturday, 18 May 2024 10:36:24 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ను గద్దె దించాలి: మాయావతి

Date : 07 May 2023 11:48 PM Views : 172

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ముఖ్యమంత్రి అని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చారని..అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అభివృద్థి చెందుతుందన్నారు. రాష్ట్రంలో బీఎస్పీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. అంబేద్కర్ పేరుతో కేసీఆర్ చేస్తున్న నాటకాలు బంద్ చేయాలని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని మార్చుతానని కేసీఆర్ అన్నారని..అలాంటి వ్యక్తిని ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కారు తీరుతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. తాము యూపీలో అధికారంలో ఉన్నప్పుడు అక్కడి దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేశామని..ఆ పథకాన్నే కేసీఆర్ కాపీ కొట్టారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయలేదన్నారు. బిహార్ లో తెలంగాణ ఐఏఎస్ అధికారిని చంపిన గ్యాంగ్ స్టర్ ను విడుదల చేస్తే..కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడేదన్నారు. దేశంలో అంబేద్కర్ లక్ష్యాలు ఇప్పటికీ నెరవేరలేదని మాయావతి అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల మద్దతుతో యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేశామని..యూపీలో ఎస్సీ,ఎస్సీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తే యూపీ తరహా పాలన అందిస్తామన్నారు. యూపీలో అన్ని పార్టీల వలే ముందే మేనిఫెస్టో ప్రకటించలేదని....అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను ప్రకటించామన్నారు. రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం అవడంతో కేసీఆర్ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. బీఎస్పీకి కార్యకర్తలే ప్రధాన బలం అని చెప్పారు. ఎన్నికల టైంలో నిరుద్యోగులకు మోసం చేయడం కామన్ అయిందని..నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని..నిరుద్యోగ భృతి కాదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కూడా ఉందని మాయావతి అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు బీఎస్పీ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. అంబేద్కర్ ఓబీసీలకు కూడా ప్రత్యేకమైన హక్కులను కల్పించారని చెప్పారు. అంబేద్కర్ లక్ష్యాలను కాన్షిరాం ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. అంబేద్కర్కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేసినా కేంద్రంలోని ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారత రత్న ఇవ్వలేదని....బీజేపీలో అధికారంలో ఉన్నా కూడా ఇవ్వడం లేదన్నారు. తమకు ఎలాంటి అధికారం, పదవులు అక్కరలేదని..అంబేద్కర్ కు భారత రత్న, మండల్ కమిషన్ ను అమలు చేస్తే చాలన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :