Saturday, 18 May 2024 10:36:21 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కేఎంసి పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ దారవత్ ప్రీతి నాయక్ కి న్యాయం చేయాలి

ఎల్ హెచ్ పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్ డిమాండ్

Date : 08 April 2023 01:49 AM Views : 154

జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : వరంగల్ జై భీమ్ ప్రతినిధి : ఆత్మహత్యకు కారణమైన నిందితులను అరెస్టు చేయడంలో విఫలమైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలనీ ఎల్ హెచ్ పీ ఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్ డిమాండ్ చేశారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో విలే కరుల సమావేశం సందర్భంగా జా టోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ డా ప్రీతి నాయక్ ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, తక్షణమే ప్రీతి నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రీతి నాయక్ లైంగిక వేధింపులతోనే, లైంగికంగా ఒప్పుకోకపోవడంతో నిందితులు హత్య చేసినట్టుగా మా అనుమానం ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిజ నిర్ధారణ చేయడం లేదని, కనీసం వరంగల్ పోలీసులు కూడా వాస్తవాలను బయటకి తెలపడం లేదని, ఇందులో కుట్రపూరితమైన నేరము దాగి ఉన్నదని, డాక్టర్ ప్రీతి నాయక్ మీద జాతి పరమైన వివక్షత కొనసాగిందని, దీనిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, ఇప్పటికే 40 రోజులు పైగా దాటుతున్న ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదని, టాక్సికాలజీ రిపోర్టులో మత్తు విష పదార్థాలు సేవించలేదని నివేదిక ఉన్నదని, అయిన కూడా డాక్టర్ ప్రీతి నాయక్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీక రిస్తున్నారని, తక్షణమే మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలను, తక్షణమే ఈ కేసును సిబిఐకి అప్పగించాలనీ డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రీతి నాయక్ కుటుంబానికి తక్షణమే 5 కోట్ల ఎక్స్ గ్రేశీయ నష్టప రిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి గ్రూపు వన్ ఉద్యోగం ఇవ్వాలనీ, డాక్టర్ ప్రీతి నాయక్ హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కేసు మొత్తంలో నిజనిర్ధారణ చేయాలని, డాక్టర్ ప్రీతి నాయక్ పేరిట ప్రత్యేకమైన ర్యాగింగ్ చట్టాలను ఏర్పాటు చేయాలన్నారు, తక్షణమే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి డాక్టర్ ప్రీతి నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని న్యాయమైన డిమాండ్ లు పరిష్కరించాలని, లేకుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బానొత్ సునీల్ నాయక్ మంద కుమార్, డాక్టర్ బాదావత్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :