Saturday, 18 May 2024 12:36:46 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి గుడ్ బై.. త్వరలోనే గులాబీ గూటికి..!

Date : 11 November 2023 03:41 PM Views : 125

జై భీమ్ టీవీ - తెలంగాణ / : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్ తగిలింది. దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి ఆపార్టీకి రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి మారిన రాజకీయ పరిణామాలతో గులాబీ గూటికి చేరుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నారు. రాత్రి రాత్రే వీరు వారు, వారు వీరు అవుతున్నారు. ఉన్న ఫలంగా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఇటీవలె బీజేపీ వీడి కాంగ్రెస్ చేరిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం. దీంతో మునుగోడు టికెట్ అశించిన నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు మునుగోడుకు చెందిన చలమల్ల కృష్ణారెడ్డి పార్టీ వీడి బీజేపీలో చేరిపోయారు. తాజాగా పాల్వాయి స్రవంతి కూడా కాంగ్రెస్ పార్టీ వీడటంతో కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలు అవాస్తవమని ఇటీవల పాల్వాయి స్రవంతి కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. అయితే, తన పార్టీలో ప్రాధాన్యం తగ్గిందన్న మనస్తాపంతో కాంగ్రెస్ వీడుతున్నట్లు స్రవంతి తెలిపారు. ఇంతలోనే ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే త్వరలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు మంత్రి కేటీ రామారావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :